
ఒక్కసారి ఎవరైనా వైసీపీ రాజకీయ విమర్శలను గమనిస్తే ఎదుటి వారి ఓర్పుని, సహనాన్ని వైసీపీ తెగేదాకా లాగుందా అనిపించక మానదు. మరి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నేతల వైఖరి చూస్తేంటే ఈ విషయం నూటికి నూరు పాళ్ళు నిజమనిపించక మానదు.
ఇన్నాళ్ళుగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాజీ భార్యల నుండి ప్రస్తుత అర్దాంగి జీవితం వరకు రాజకీయ వేదికల మీద చర్చకు ఉంచారు మాజీ ముఖ్యమంత్రి
వైస్ జగన్. అయితే ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేయడానికి ఆయన కూతుర్లను రాజకీయాలలోకి లాగుతున్నారు.
ఏపీలో తాజా వివాదమైన తిరుమల శ్రీ వారి అన్య మతస్తుల దర్శనానికి సంబంధించిన డిక్లరేషన్ విషయంలో వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేసి తిరుమల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
అలాగే పవన్ తన చిన్న కూతురు పోలినాతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చి ఆమెతో డిక్లరేషన్ ఇప్పించి మరి వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే నేడు దసరా శరన్నవరాతుల నేపథ్యంలో సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గామాతను తన మొదటి కూతురు ఆద్యతో కలిసి దర్శించుకున్నారు పవన్.
అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తమ రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారు వైసీపీ నేతలు. తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి మరి తన చిన్న కూతురుని వెంకన్న దర్శనానికి తీసుకు వెళ్లిన పవన్ మరి ఇప్పుడు ఆమెను అమ్మవారి దర్శనానికి ఎందుకు తీసుకురాలేకపోయారు.? అంటూ పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.
అలాగే తన భార్య అన్నా లెజినోవాను తిరుమల క్షేత్రానికి పవన్ ఎందుకు తీసుకు రాలేదు అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ విమర్శలలో ఎటువంటి బలం లేకపోయినా తనకున్న మీడియాను ఉపయోగించుకుని ప్రజలలో పవన్ పట్ల ఏవో అపోహలు సృష్టించాలని వైసీపీ భావిస్తున్నట్లుగా ఉంది.
మహిళలు దేవాలయాలకు వెళ్లాలా లేదా అనేది వారి వ్యక్తిగత సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. పురుషుల మాదిరి ఎప్పుడు అనుకుంటే అప్పుడు వారు దేవాలయాల దర్శనానికి వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. కనీసం ఇటువంటి విషయాలు కూడా వైసీపీ నేతల కోడి బుర్రలకు అర్ధం కావా.? అంటూ జనసేన నేతలు వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.
అలాగే అన్నా లెజినోవా గతంలో తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి హిందువుల పుణ్య క్షేత్రమైన కాశీ దేవాలయానికి వెళ్లి అక్కడ పూజ కార్యక్రమాలలో పాల్గొన్న విషయం వైసీపీ నేతలకు కనిపించలేదా.? అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఏనాడూ తన భార్య భారతిరెడ్డితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిందే లేదు.
ఇటువంటి వారు ఇప్పుడు పవన్ భార్య తిరుమల పర్యటన గురించి ఆయన కూతురు అమ్మవారికి దర్శనం గురించి విమర్శలు చేయడం చాల పెళవంగా ఉన్నాయి అంటూ సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. వైసీపీ ఇప్పటికైనా పవన్ భార్య గురించి కూతుర్ల గురించిన విషయంలో కాస్త సంయమనం పాటిస్తూ విషయాన్ని తెగేదాకా లాగకుండా ఉంటే వారికే మంచిది అనే అభిప్రాయం వినపడుతుంది.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…