ఎక్కడ తగ్గాలో కాదు… ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలోకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో జగన్, షర్మిల మద్య ఎలాగూ రేసు మొదలవుతుంది. ఇప్పటికే వారిద్దరి గురించి చెప్పుకొన్నాము. ఎప్పటికైనా ఏపీ సిఎం కావాలనుకొంటున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గురించి ఇప్పుడు చెప్పుకొందాము.

పవన్‌ కళ్యాణ్‌ గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరింత రాజకీయ పరిణతితో వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. బీజేపీ, టిడిపిలను బేరీజు వేసుకొని టిడిపితో పొత్తుతోనే రాజకీయంగా లాభం ఉంటుందని నిర్ణయించుకుని ఆ దిశలో ముందుకు సాగుతుండటమే ఇందుకు నిదర్శనం.

ADVERTISEMENT

అలాగని బీజేపీతో తెగతెంపులు చేసుకోలేదు. మోడీ, అమిత్ షాల మీద కత్తులు దూయడం లేదు. నేటికీ వారి పట్ల విధేయత చూపుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మేలు, ప్రయోజనాలే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొంటున్నారు.

ఎప్పటికైనా ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ నిర్మొహమాటంగా చెపుతున్నారు. ఇది సహజమే. తద్వారా తన అభిమానులకు, కులస్తులకు, బీజేపీ పెద్దలకు కూడా మంచి సంకేతమే ఇస్తున్నట్లు భావించవచ్చు.

భవిష్యత్‌లో ఏపీలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పవన్‌ కళ్యాణే సరైన ఆయుధమని మోడీ, అమిత్ షాలు గట్టిగా నమ్ముతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా వారి పట్ల విధేయంగా ఉంటున్నారు కనుక వారు కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు తప్పకుండా తోడ్పడవచ్చు. అందుకే తనకు మోడీ ఆశీస్సులు ఉన్నాయని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పుకుంటున్నారనుకోవచ్చు.

ప్రస్తుతానికి పవన్‌ కళ్యాణ్‌ ముందున్న లక్ష్యం… శాసనసభ ఎన్నికలలో గెలిచి శాసనసభలో అడుగుపెట్టడం. ఆ తర్వాత టిడిపి, జనసేనల సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావడం. ఈ రెండూ సాధించగలిగితే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కిన్నట్లే!

కానీ ఒకవేళ టిడిపి, జనసేనలు ఓడిపోతే పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోవడం ఖాయమే. అదే కనుక చేస్తే ఏపీ రాజకీయాలలో ఆయన స్థానాన్ని వైఎస్ షర్మిల ఆక్రమించడం ఖాయం. ఆమె పవన్‌ కళ్యాణ్‌లాగా రెండు పడవల ప్రయాణం చేయడం లేదు. కనుక పూర్తి సమయం రాజకీయాలలో పనిచేస్తూ 2029 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో సిద్దం చేసుకొంటారు. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా అన్న చిరంజీవిలాగ జనసేన పార్టీని కాంగ్రెస్‌లోనో లేదా టిడిపిలోనో విలీనం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

కనుక ఈ ఎన్నికలలో టిడిపి, జనసేనలు గెలిచినా, ఓడినా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తేనే జనసేన నిలద్రొక్కుకోగలదు.

కానీ రాజకీయాల కోసం, వస్తుందో రాదో తెలీని ముఖ్యమంత్రి పదవి కోసం కోట్లు కురిపిస్తున్న సినిమాలను, దాంతో లభించే స్టార్ ఇమేజ్‌ని, అభిమానులను పవన్‌ కళ్యాణ్‌ వదులుకోగలరా?సినిమాలు వదులుకుంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా?

మరి పవన్‌ కళ్యాణ్‌ ఏమి చేస్తారో తెలియాలంటే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎదురు చూడాల్సిందే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

20 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

27 minutes ago