పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో!

Pawan Kalyan - Ashok Gaja Pati Raju Andhra Pradesh Politicsఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తెలియని వ్యక్తులుంటారా? ఉహ తెలియని పిల్లలను, ఈ తరం సినిమాలను చూడని పండు ముసలి వారి జాబితాను మినహాయిస్తే… పవన్ కళ్యాణ్ అన్న పేరు సుపరిచితమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ, రాజకీయ వ్యక్తులకు అయితే పవన్ అనే పేరు ఒక సెన్సేషన్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ పేరు తనకు తెలియదు అని ప్రముఖ కేంద్రమంత్రి అంటే… పవన్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుంది..? రియాక్షన్ సంగతి పక్కన పెడితే, ఇంతకీ అంత మాటన్న వ్యక్తి ఎవరు? అన్న ఆసక్తి కలుగుతుంది.

మరెవరో కాదు… కేంద్రమంత్రి అశోక గజపతిరాజు. టీటీడీ ఈవోగా నియామకంపై పవన్ ప్రశ్నించిన అంశంపై మీడియా వర్గాలు సదరు కేంద్రమంత్రి అభిప్రాయం కోరగా… పవన్ కళ్యాణ్ ఎవరు? అంటూ ఎదురు ప్రశ్నించడం అశోక గజపతి రాజు వంతయ్యింది. దానికి ‘సినిమా హీరో’ అని మీడియా వర్గాలు చెప్పగా, ‘తాను సినిమాలు చూసి చాలా కాలమైందని, అందుకే అతనెవరో తనకు తెలియదు’ అంటూ బదులిచ్చారు అశోక గజపతిరాజు.

ADVERTISEMENT

గతంలో పవన్ నిర్వహించిన బహిరంగ సభలలో కేంద్రమంత్రిగా విధులు నిర్వహిస్తున్న అశోక గజపతిరాజుపై కూడా ‘జనసేన’ అధినేత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ పై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అశోక గజపతిరాజు వంటి వ్యక్తిపై కూడా పవన్ విమర్శలు గుప్పించడం అనేది, అతని పరిపక్వతను, అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు పవన్ పై అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

బహుశా ఈ వ్యాఖ్యలకు కేంద్రమంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు కూడా అప్పుడు హార్ట్ అయ్యుంటారేమో! తన టైం ఎప్పుడు వస్తుందా అని వేచిచూడడమే రాజకీయాలు గనుక, నాడు పెద్దగా స్పందించకపోయినా, నేడు అదే రివేంజ్ ను ఈ రూపంలో విజయనగరం వాస్త్యవ్యుడు తీర్చుకుంటున్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలలో ఇలాంటి రివేంజ్ లు సర్వ సాధారణం గనుక, పవన్ అభిమానులు కూడా వీటికి హర్ట్ అవ్వకుండా, అలవాటు పడిపోవాలి అని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories