
ఈ సందర్భంగా ఓ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ‘యు/ఎ’గా ధృవీకరించారు. బుల్లెట్ పై దుమ్ము లేపుతూ ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ను పంచుతోంది. చూడబోతుంటే మరో “గబ్బర్ సింగ్” మాదిరి ఫ్యాన్స్ స్టఫ్ అంతా నిండిపోయి ఉన్నట్లుగా “భీమ్లా నాయక్” కనపడుతున్నాడు.
ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఇసుమంత కూడా కనిపించడం లేదు గానీ, ‘గబ్బర్ సింగ్’లో వాడిన ‘కటౌట్ ఉన్నోడికి కంటెంట్ తో పనిలేదన్న’ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. మరికొద్ది గంటల్లో ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
145 నిముషాల రన్ టైం కలిగిన “భీమ్లా నాయక్” సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ లో ప్రారంభం అయ్యాయి. ఈ బుకింగ్స్ తీరు ఒక్కటి చాలు… ఈ మాస్ ఎంటర్ టైనర్ పై సినీ ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అని చెప్పడానికి! యుఎస్ ప్రీమియర్స్ 1 మిలియన్ డాలర్స్ దాటి వసూలు చేస్తుందన్న అంచనాలు ట్రేడ్ వర్గాలలో నెలకొంది.
After a long wait of seven years, the Student of the Year franchise is finally…
Megastar Chiranjeevi’s next release is Kaaka, directed by Bobby Kolli. The film marks the Telugu…