
2014 లో జనసేన పార్టీతో రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నాటి నుంచి నేటి వరకు తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నారు. “కాంగ్రెస్ హటావో దేశ్ బచావో” అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ “హలో ఏపీ బై బై వైసీపీ” నినాదంతో అధికారం లోకి అడుగుపెట్టారు.
ఆయన పొలిటికల్ ఎంట్రీ వెనుక కాంగ్రెస్ పతనం ఉంటే ఆయన అధికార పీఠం అందుకోవడం వెనుక వైసీపీ పతనం కనిపిస్తుంది. ఇక 2014 పొలిటికల్ ఎంట్రీ తోనే పవన్ టీడీపీ, బీజేపీ తో రాజకీయ పొత్తు పెట్టుకున్నారు. కానీ 2019 అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒంటరి పోరుకి సై అన్నారు.
దీనితో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావు అనే ప్రత్యర్థి పార్టీల నిందలు మోస్తూ చివరికి అదే బీజేపీ తో జట్టు కట్టి టీడీపీ తో కలిపి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా 2024 లో పోటీ చేసిన 21 స్థానాలలో విజయం సాధించి అధికార పీఠం అందుకున్నారు, ఏపీ ఉపముఖ్యమంత్రి హోదా పొందారు.
అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పవన్ కి బీజేపీ తో ఉన్న తత్ససంబంధం పవన్ కు కొత్త రాజకీయ శత్రువులను తెచ్చిపెడుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారారా.?. ప్రకాష్ రాజ్ కు బీజేపీ పై ఉన్న అమితమైన ద్వేషం ‘జస్ట్ ఆస్కింగ్’రూపంలో పవన్ టార్గెట్ గా ముందుకెళ్తుంది.
పవన్ ప్రశ్నించినా తప్పే, పవన్ సమాధానం చెప్పినా తప్పే, పవన్ నోరెత్తిన తప్పే, పవన్ మౌనంగా ఉన్నా తప్పే అన్నట్టుగా ప్రకాష్ రాజ్ పవన్ పై జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అయితే ప్రకాష్ కి పవన్ పై ఇంత ద్వేషమా.? ఇది ఆయనకు పవన్ మీదున్న వ్యక్తిగత వైరమా.? లేక బీజేపీ మిత్రపక్షంలో భాగం అవ్వడం వలన ఏర్పడిన విద్వేషమా.? లేదా సినీ రంగంలో ఉన్న విభేదాలా.?
విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ అభిమానులున్నారు. అయితే పవన్ ను ఈ స్థాయిలో టార్గెట్ చేసేంతగా వీరిద్దరి మధ్య అసలేం జరిగింది అంటే అందుకు బీజేపీ తో పవన్ రాజకీయ స్నేహమే కారణం అని యిట్టె చెప్పవచ్చు.
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా బీజేపీ మీదున్న రాజకీయ ద్వేషం పవన్ పై చూపిస్తున్నారు ప్రకాష్. అయితే ఇందుకు బీజేపీ పవన్ కు మద్దతుగా నిలుస్తుందా.? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు ఎదురుదాడి చేస్తుందా అంటే ఈ విషయంలో బీజేపీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతుంది.
పవన్ కు ఉన్న సినీ గ్లామర్, స్టార్ హీరో ఇమేజ్, పవన్ అభిమనుల ఉత్సాహాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పవన్ ను తన పార్టీ ఎన్నికల ప్రచారాలకు వాడుకుంటుంది. దీనితో అక్కడ బీజేపీ కి ప్రత్యర్థిగా ఉన్న పార్టీల నేతలు పవన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పవన్ పై జరుగుతున్న రాజకీయ దాడి, వ్యక్తిత్వ హననం వెనుక కూడా టి.బీజేపీ తో పవన్ అన్న ప్రచారమే కారణంగా కనిపిస్తుంది. అటు తమిళనాట కూడా పవన్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోయినా విజయ్ టీవీకే విజయంతో పవన్ బీజేపీ ప్రత్యర్థుల టార్గెట్ అయ్యారు.
పవన్ సనాతన ధర్మం వెనుక, పవన్ జాతీయవాదం వెనుక, హిందీ భాష మద్దతు వెనుక కూడా బీజేపీ పాత్ర ఉందనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. అయితే బీజేపీ తో పవన్ స్నేహం జనసేనకు బలంగా మారాల్సింది పోయి లేనిపోని కొత్త రాజకీయ శత్రువులను తెచ్చిపెడుతుంది.
పవన్, బీజేపీ కోసం ఇంతలా అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా, ఆరోపణలు మోస్తున్నా, నిందలు భరిస్తున్నా, అవమానాలను తట్టుకుంటున్నా కనీసం రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల నుంచి పవన్ కు కానీ జనసేనకు దక్కిన మద్దతేమిటి.?
Secret Soldier may appear to be a straightforward spy thriller, but director Akki Viswanadha Reddy…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj is all set to return with…