
కానీ, తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త సంచలనాత్మకమైంది. లెజండరీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు బ్యానర్ లో పవన్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం దర్శకుల వేటలో ఉన్న దాసరి, చివరికి బోయపాటి శ్రీనుకు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. ఒక మాస్ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా కూడా సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
ఈ వార్తలలో వాస్తవం ఎంత ఉందో గానీ, ఇది కార్యరూపం దాలిస్తే… పవర్ స్టార్ అభిమానులకు అసలైన పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా హీరో అల్లు అర్జున్ కు “సరైనోడు” రూపంలో బ్రేక్ ఇచ్చిన బోయపాటి, త్వరలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంతలో లేటెస్ట్ గా పవన్ వచ్చి చేరడంతో… మెగా క్యాంప్ లో బోయపాటి సెటిల్ అయ్యారని, త్వరలోనే మిగిలిన మెగా హీరోలను కూడా ఒక రౌండ్ వేసుకుని, అప్పుడు బయటకు వస్తారని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…