
అయితే పవన్ లేరన్న అనుభూతిని పొందిన ఓ అభిమాని, ఆ లోటు భర్తీ చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ ఫోటో. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఉండటమే కాదు, ఏకంగా పవన్ కళ్యాణే సెల్ఫీ తీసినట్లుగా తన క్రియేటివిటీని ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది… మెగా అభిమానులకు కావలసిన పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫోటోలో ఉండడంతో అది కాస్త అసలు ఫోటోను మించిపోయే రేంజ్ లో వైరల్ అయ్యింది. ‘అసలు’ కంటే ‘వడ్డీ’ ముద్దంటే ఇదేనేమో..!
అసలు (మొదటి) ఫోటో చూడని కొందరు అభిమానులైతే, నిజంగా పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీశారా… అని ఆశ్చర్యపోయే విధంగా ఈ ఫోటో ఆకట్టుకుంటోంది. అయితే తొలి ఫోటోను చూసిన ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోను ఎడిటింగ్ చేసిన వాళ్లకు అవార్డు ఇవ్వాల్సిందేనని తెగ మెచ్చుకుంటున్నారు. మెగా హీరోలందరి కలయికలో పవన్ లేని లోటును అభిమానులు అలా ఫీలవుతున్నారు మరి! ఏది ఏమైతేనేం… పవన్ నిజంగా లేకపోయినా… ఉన్నట్లు సృష్టించిన ఈ ఫోటోను చూసుకుని పండగ చేసుకుంటున్నారు.
India’s T20 captaincy discussion has once again become a major talking point, with selectors yet…
The official release date of Akshay Kumar and Anees Bazmee film, Ram Aur Shyam has…