
తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలు, ఎన్నికలపై ఉండవని, 175 సీట్లు మావేనని ఓ వైపు వాదిస్తూనే, టిడిపి, జనసేనల మద్య చిచ్చు పెట్టేందుకు వైసీపి, దాని ఆత్మసాక్షి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో జనసేన అభ్యర్ధులకు టిడిపి మద్దతు ఇవ్వలేదు కనుక ఏపీలో కాపు సామాజికవర్గం టిడిపితో మనకి పొత్తు అవసరమా?అని పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తున్నట్లు ఆత్మసాక్షి సొంత కవిత్వం చెప్పుకొంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో సంసారం, టిడిపితో సహజీవనం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వీటికి పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా జవాబు చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపికి ఓ సిద్దాంతం, భావజాలం అంటూ ఏమీ లేవు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరూ వైసీపిగా ఏర్పడి కులం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారు అంతే! వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాని ప్రతిష్ట, అభివృద్ధి, ప్రజల గురించి ఎటువంటి ఆలోచనా లేదు.
ఎప్పుడూ కులరాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదా ప్రతిపక్షాలని విమర్శిస్తుండటమే తప్ప మరొకటి తెలీదు. కనుక ఓ సిద్దాంతం, భావజాలం అంటూ లేని వైసీపిని రాజకీయ పార్టీ అని చెప్పుకోవడమే తప్పు. అటువంటి పార్టీలో నాయకులమని చెప్పుకొంటున్నవారు నా గురించి, నా పార్టీ నిర్ణయాలు, మా పార్టీల పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు.
మా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల గురించి నిర్ధిష్టమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మేము రాజకీయంగా ముందుకు సాగుతున్నాము. కనుకనే ప్రధాని నరేంద్రమోడీ అంతటివ్యక్తి నన్ను పక్కన కూర్చొబెట్టుకొని రాష్ట్రానికి సంబందించిన అంశాలపై మాట్లాడుతుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే ఆయనను ప్రధాని నరేంద్రమోడీ దరిదాపులకైనా రానిచ్చేవారా? కాస్త ఆలోచించుకొంటే మంచిది,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…