
పవన్ నటించిన గత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేస్తూ… ‘జనసేన’ సభల్లో పవన్ మాటలను జోడించి రూపొందించిన ఈ పాటలు వినడానికి కర్ణకఠోరంగా మారాయి. ఒక్క పాటంటే ఒక్క పాట కూడా శ్రోతలను ఆకట్టుకోవడం మాట పక్కనపెడితే, మరో విధంగా సంగీత సాహిత్య ప్రియులకు విరక్తి కలుగుతోంది. ఇవి ‘దేశ్ బచావ్’ పాటల మాదిరి కాకుండా, గతంలోని తన సినిమాల్లోని పాటలను మళ్ళీ రీ ప్రమోట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది.
ఈ ఆల్బమ్ ద్వారా పవన్ ఏం సాధించారు? అంటే తన ‘జనసేన’ యూ ట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్స్ సంఖ్యను మరో ఆరుకు పెంచుకోవడం తప్ప, ఒరిగింది ఏమీ లేదు. ఈ పాటలను ముందుగా ఫిబ్రవరి 5న విడుదల చేద్దామని భావించి, ప్రీ పోన్ చేస్తూ నేడు విడుదల చేసారు. నేడు కాదు, ఫిబ్రవరి 5 కాదు, ఈ ఆల్బమ్ ను ఎప్పుడూ రిలీజ్ చేసినా ఒక్కటే… ప్రయోజనం శూన్యం… సమయం వృధా కావడం తప్ప..!
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…