పవన్ కళ్యాణ్ అంత్యక్రియలకు రావాలంటూ లేఖ రాసి ఫ్యాన్ ఆత్మహత్య

Pawan Kalyan Fan Suicideవిజయవాడ పెన్‌జోన్‌పేటలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్‌ అనే జిమ్ ట్రైనర్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. జనసేన చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అనిల్ పాలుపంచుకునేవాడు. కానీ ఇటీవల కాలంలో జనసేనకు తాను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడేవాడు. జనసేన కోసం ఏదో ఒకటి చేస్తానని చెబుతుండేవాడు.

[m9ad]

ADVERTISEMENT

నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ తన అంత్యక్రియల్లో పాల్గొనాలని అనిల్ తన చివరి కోరికగా సూసైడ్ నోట్‌లో రాశాడు. తన అభిమాన హీరో, అన్నయ్య కుటుంబసభ్యుడు పవన్ కల్యాణ్ అంటూ.. లేఖలో ప్రస్తావిస్తూ.. తన ఆత్మకు శాంతి చేకూరాలంటే తనను చూసేందుకు పవన్ రావాలని లేఖలో పేర్కొన్నాడు.

ఆయన చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరాడు. చేతికి అందివచ్చిన కొడుకు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు కన్నీరు మునీరుగా విలపిస్తోంది. దీనిపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories