Telugu

పవన్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోని ‘అ…ఆ..?’

యువ హీరో నితిన్ సినిమా విడుదల అవుతోంది అంటే… అభిమానులు, సాధారణ ప్రేక్షకులతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువగా సందడి చేస్తుంటారు. ‘ఇష్క్’ సినిమా నుండి మొదలైన ఈ సహకారం, ప్రస్తుత ‘అ… ఆ…’ వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆడియో వేడుకలకు విచ్చేసి ఫ్యాన్స్ లో పవన్ ఉత్సాహం నింపుతుండగా, ఇవన్నీ నితిన్ సినిమా ఓపెనింగ్స్ కు కారణమవుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘అ… ఆ…’ సినిమా మాత్రం ఒకింత నిరుత్సాహపరిచినట్లుగా సోషల్ మీడియా వేదికగా బహిర్గతమవుతోంది.

నితిన్ సినిమా అంటే… దాదాపు పవన్ నామస్మరణ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా మొత్తమ్మీద ఒక దాదాపు ఒక పదిహేను నిముషాల పాటు పవన్ స్మరణ చేసారంటే… ఏ రీతిలో పవన్ ప్రభావం నితిన్ పై ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఒక్క సినిమానే కాదు, నితిన్ సినిమాలలో పవన్ గురించి కనీసం ఓ నాలుగైదు సార్లైనా ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఇంకాస్త పవర్ ఫుల్ డైలాగ్ లతో పవన్ పై డైలాగ్ ఉంటాయని భావించారు.

ADVERTISEMENT

కానీ, ‘అ… ఆ…’లో మాత్రం ఒకటంటే ఒక్కసారే ప్రస్తావించారు… అది కూడా ఇప్పటికే ట్రైలర్ లో ఇప్పటికే చూపించిన డైలాగ్ కావడంతో వెండితెరపై ఫ్యాన్స్ కు పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది. దీంతో తమ అభిమాన హీరోను ఆకాశానికేత్తేసే డైలాగ్ లు లేక అంచనాలు అందుకోలేకపోయినా… సినిమా పరంగా, త్రివిక్రమ్ డైలాగ్ ల పరంగా ‘అ…ఆ…’ నిరుత్సాహపరచట్లేదని… సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Why Prabhas and Akshay Ran Away from Shraddha Kapoor?

Akshay Kumar and Shraddha Kapoor were supposed to clash at the box office in December…

13 minutes ago

Nani’s Big Paradise Request: Will Revanth Reddy Allow?

After the tragic stampede during the Pushpa 2 premiere at Sandhya Theatre in Hyderabad, Tollywood…

33 minutes ago