వైసీపీ కి ‘వామన’ అవతారం జనసేనే..!

జనసేనను కించపరుస్తున్న వైసీపీ నేతలను ‘మక్కెలిరగదీసి మడత మంచంలో కూర్చోబెడతా’ అంటూ మొదలుపెట్టిన పవన్ అటు వైసీపీ పార్టీకి ఇటు వైసీపీ నాయకులకి తన ప్రసంగంతో చెమటలు పట్టించారనే చెప్పాలి. తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభతో తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలవ్వడం ఖాయం అంటూ పవన్ తన ఇన్నాళ్ల మోనాన్ని వీడి వైసీపీ కి తన విశ్వరూపం చూపించారు.

జనసేనకు 24 సీట్లేనా అంటూ నిట్టూరుస్తున్న, రెచ్చగొడుతున్న వారందరికీ ఒకే ఒక్క ఉదాహరణతో నోరు మూపించారు పవన్. గాయత్రీ మంత్రంలోని అక్షరాలు 24 , విశ్వామిత్రుడి బ్రహ్మపదార్థం 24 , అలాగే జనసేన సీట్లు 24 . ఆ 24 లో ఎంత పవర్ ఉందో ఈ జనసేన తీసుకున్న 24 సీట్లు రాష్ట్రంలో అంతే బలాన్ని చూపిస్తుంది.

ADVERTISEMENT

వామనావతారంలో ఉన్న విష్ణు మూర్తిని చూసి బలిచక్రవర్తి ఇంతేనా అంటూ తక్కువ అంచనా వేసాడు. ఆ ఇంతేనా అన్న వామనుడే బలిచక్రవర్తిని తన అరికాలుతో పాతాళానికి తొక్కాడు. అప్పుడు ఇంతేనా అన్నవాడు ఇంతా అంటూ పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు 24 సీట్లేనా అంటూ రెచ్చిపోతున్న వైసీపీ అనే బలి చక్రవర్తిని తొక్కబోయేది కూడా ఇంతేనా అంటూ చిన్న చూపు చూస్తున్న జనసేనే అనేది గుర్తుపెట్టుకోండి అంటూ వైసీపీ కి గట్టి కౌంటర్ వేశారు జనసేనాని.

ఇన్నాళ్లు జరగబోయేది కురుక్షేత్రం, అందులో బలవ్వడనికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని, నాది పాండవ సేన వారిది కౌరవ సేన అంటూ పురాణాల చరిత్రను తిరగేస్తున్న జగన్ కు అదే పురాణాలలో నోరు విప్పలేని సమాధానం చెప్పారు పవన్. 24 లో ఇంత పవర్ ఉంటుందని..,ఒకరిని చిన్నచూపు చూస్తే పాతాళానికి వెళ్లిపోయే చరిత్రలు పురాణాలలో ఉన్నాయని జగన్ కు స్క్రిప్ట్ రాస్తున్న స్క్రిప్ట్ రచయితలకు తెలియదేమో పాపం అంటూ జగన్ పై జాలిపడుతున్నారు జనసైనికులు.

అంకెల సంఖ్యను బట్టి పార్టీ బలాన్ని అంచనా వెయ్యొద్దు. సామాన్యుడు రాజకీయ చేస్తే భరించాలరని జగన్ ఆధిపత్య ధోరణి త్వరలోనే బద్దలు కాబోతుంది.అధికారం తో ఫ్యాక్షన్ కోతలు కట్టుకున్న వైసీపీ ని ఇంటికి పంపే వామనుడే ఈ జనసేన. వైసీపీ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే జనసేన – టీడీపీ మధ్య సంఘర్షణ వాతావరణం కాదు సహకార వాతావరణం ఉండాలి అంటూ ఇరు పార్టీల నేతలు దిశా నిర్దేశం చేసారు పవన్.

ఈ రోజు పవన్ ప్రసంగం ఆలోచనతో కూడిన ఆవేశం తో కలగలిపి ప్రత్యర్థి పార్టీకి ఓటమి భయాన్ని సొంత పార్టీ కి కలిసి వెళాల్సిన బాధ్యతని మిత్ర పక్షానికి గెలిపించాల్సిన బరువుని తెలియచెప్పారు. RRR లాగా BBB అన్నమాట.

Photos: TDP-Janasena Mega Meeting Highlights

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

6 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

7 hours ago