పవన్ కళ్యాణ్… వాళ్లకి అవకాశం కల్పించాడు..!

pawan kalyan gave chance to kamaal r khan, twitter, RGV‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఇచ్చిన ఫలితం ఇప్పటివరకు పవన్ పై విరుచుకుపడిన కమల్ ఖాన్ లాంటి వాళ్లకు మరింత ఊపునిచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసిన కమల్ ఖాన్, తాజాగా సినిమా విడుదలై ఫలితం వెలువడిన తర్వాత తన ట్విట్టర్ అకౌంట్ కు మరోసారి పని చెప్పాడు.

“హిందీని మరచిపోండి.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తెలుగులో కూడా ఆల్ టైం ఫ్లాప్ సినిమా అని నాకు రిపోర్టులు వస్తున్నాయి. ప్రజలు అలానే అంటున్నారు. సార్… మీ సినిమా ఫ్లాప్ తో మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్ అయిపోయారు. ఇక నేను తీస్తున్న దేశద్రోహి-2లో నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

ఈ చిత్రం విడుదలైన తరువాత అభిప్రాయాలు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కమాల్ ఖాన్ తో పాటు, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ ల అభిప్రాయాలను కూడా కోరగా, వాళ్లిద్దరూ ఇంకా స్పందించలేదు గానీ, కమల్ మాత్రం ఈ రేంజ్ లో ట్వీట్లు పెట్టాడు. దీనిపై అభిమానులు కూడా పెద్దగా స్పందించడానికి వీలు లేకుండా కమల్ ఖాన్ వంటి వారికి పవర్ స్టార్ అవకాశం కల్పించినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories