
ఇటీవల శాసనసభలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ 1100 మంది మాట్లాడుతున్నట్లు ఒకే గొంతుతో ఒకే మాట మాట్లాడుతుంటారు.. అది కల్తీ నెయ్యి వంటి అబద్దమైనా సరే! కూటమిలో కూడా అలాంటి ఐఖ్యత అవసరం,” అని అన్నారు.
నేడు తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ అధినేత జగన్ ప్రెస్‌మీట్‌లో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందని, హామీలు అమలుచేయడం లేదని స్క్రిప్ట్ చూసి చదివేశాక, ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అదే… శాసనసభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి.
చేతిలో ఉన్న స్క్రిప్టులో ఆ ప్రశ్నకు జవాబు లేకపోవడంతో కొంచెం తడబడ్డారు. కానీ అ విలేఖరి ప్రశ్నలోనే ఇస్తున్న హింట్ క్యాచ్ చేసి, “మా 11 మంది ఎమ్మెల్యేలే 1100 మందన్నట్లు పవన్ కళ్యాణ్‌ని భయపెట్టగలుగుతున్నామంటే అది కాంప్లిమెంటే కదా?” అన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ 11 మందిని చూసి భయపడుతున్నామని చెప్పలేదు. వారు అబద్దమైన అందరూ కలిసికట్టుగా గట్టిగా చెపుతుంటారని, మనలో కూడా అలాంటి ఐఖ్యత అవసరమని మాత్రమే అన్నారు. జగన్ సిఎంగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ భయపడలేదు. ఇప్పుడు భయపడతారా? అంటే కాదని అందరికీ తెలుసు. నిజానికి శాసనసభకు, తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావడానికి జగనే భయపడుతున్నారు కదా?
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…