1965-1975 మధ్య ఉస్మానియా యూనివర్సిటీలోని ఒక స్టూడెంట్ లీడర్, జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా జార్జ్ రెడ్డి (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్). ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఆ సినిమాకు ఆ రోజున పోటీ ఉండదు. అయితే తొందరలో జరగబోయే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో అగ్రకుల అహంకారం మీద సమసమాజ స్థాపన కోసం పోరాటం చేశాడు జార్జ్ రెడ్డి చివరకు 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి అతనిని హత్య చేశారు.
వామపక్ష భావాలు ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు హాజరు కావడానికి వెంటనే ఒప్పుకున్నారట. ఎన్నికల ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న మొదటి సినిమా ఈవెంట్ ఇదే. పవన్ కళ్యాణ్ రాకతో ఈ సినిమా మీద హైప్ మరింత పెరుగుతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తేదీని, జరగబోయే ప్రదేశాన్ని తొందరలో ప్రకటించబోతున్నారు.
వంగవీటి మూవీలో నటించిన సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి, శత్రు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.





