Telugu

గెలుపు ఆనందం వ్యక్తిగత సమస్యతో చిన్నబోయిందా.?

2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త నూతన అధ్యాయాన్ని లిఖించింది అనడంలో రెండో ఆలోచన అవసరం లేదు. 151 సీట్లతో అందనంత ఎత్తులో ఉన్న వైసీపీ ని 11 తో పాతాళానికి తెచ్చి 164 సీట్లతో కూటమి ఆకాశమంత విజయం సాధించింది.

అయితే నాటి కూటమి గెలుపుని ముఖ్యంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ ను కూటమి మద్దతుదారులతో పాటుగా ఒక సామాన్య ఓటర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. నాటి పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు అనే ఘోర అవమానానికి నేటి ఈ 100% స్ట్రైక్ రేట్ సమాధానం అంటూ జనసేన క్యాడర్ కాలర్ ఎగరేశారు.

ADVERTISEMENT

అయితే నాడు ఆ స్థాయి విజయం సాధించిన తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ పాలనతో, తమ ప్రభుత్వ విధానాలతో ప్రజలను ఏ మేరకు సంతృప్తి పరిచిందో తెలుసుకోడానికి రాష్ట్రంలో తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.

2024 ఎన్నికల్లో సుమారు 94% విన్నింగ్ స్ట్రైక్ రేట్ సాధించిన కూటమి మీద రాజకీయ ఒత్తిడి, ప్రజల నుంచి అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే వాటన్నిటిని అందుకుంటూ, ప్రజలను సంతృప్తి పరుస్తూ, మూడు పార్టీల మధ్య పొత్తు ధర్మాన్ని కొనసాగిస్తూ తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

కానీ కూటమి ఆ విజయాన్ని మరోసారి నమోదుచేసింది. చివరికి జగన్ కంచుకోట పులివెందులలో కూడా వైసీపీ ఓటమిని జగన్ కు రిటర్న్ గిఫ్ట్ గా అందించగలిగింది. అలాగే ఇటు జనసేన విషయానికొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన మరోసారి 100% స్ట్రైక్ రేట్ సాధించి మరోసారికొత్త చరిత్ర సృష్టించింది.

ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడ వంటి కీలక నగరంలో జనసేన మేయర్ సీటు గెలుచుకోవడంతో పాటుగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానంలో ఆ పార్టీ విజయం సాధించింది. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా జనసేన తన సత్తా చాటింది.

ఇటువంటి ఆనంద శుభసమయాన, రాజకీయ గెలుపుని ఆస్వాదించాల్సిన జనసేనాని, జనసైనికులు నిశ్శబ్దం లోకి వెళ్లిపోయారు. జనసేన, కూటమి రాజకీయ గెలుపు పవన్ వ్యక్తిగత సమస్యల తో చిన్నబోయినట్లయ్యింది. అయితే పవన్ ను తాకిన ఈ విడాకుల ముసురు జనసేనను రాజకీయంగా కుంగతీయకుండా చూసుకోవడంతో పాటుగా జనసేన రాజకీయ గెలుపుని పార్టీ బలోపేతానికి వినియోగించాల్సిన బాధ్యత కూడా సేనానిదే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Kohli’s Last WC? Coach Hints At Another Chapter

Virat Kohli may continue playing ODI cricket even after the 2027 World Cup. His childhood…

26 minutes ago

పాక్‌తో మరో యుద్ధం తప్పదా?

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.…

46 minutes ago