
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా వారు అభివర్ణించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ 6న పాదయాత్రలు చేపడతాం అని ప్రకటించారు. ప్రధానంగా జాతీయ రహదారులపైనే ఈ పాదయాత్ర జరుగుతుంది. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అక్కడి ముఖ్య కూడలిలో పాదయాత్రలు నిర్వహిస్తాం అని తెలిపారు.
ఒక్క రోజులో కొన్ని గంటలు పాటు జరిగే ఈ పాదయాత్రలో విజయవాడలో పవన్ కళ్యాణ్ కూడా నడవబోతున్నారు. ప్రజాకర్షణ కలిగిన సినిమా హీరో కాబట్టి ఆయనను చూడటానికి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనితో భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ముఖ్యం. ఈ పాదయాత్ర సక్సెస్ బట్టి జనసేన ప్రభావం అంచనా వెయ్యవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేని చోట్ల పార్టీని ఎలా సంఘటితం చేస్తారు అనేదే కీలకం.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…