
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం శల్యసారధ్యం చేస్తున్నారంటే, ‘అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా హర్ట్ అయ్యారు. టిడిపితో జనసేనకు పొత్తు చాలా అవసరమని చెపితే ‘యాక్’ అన్నారు.
సరే గిట్టనివారు బోలెడు చెపుతుంటారని సరిపెట్టుకున్నా, మొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా జెండా సభలో ఇదే విషయం తన శైలిలో చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. చాలా మంది హర్ట్ అయ్యారు.
ఇంకా ఎక్కువ హర్ట్ అయిన జోగయ్య, ముద్రగడ వంటి పెద్దలు తాము చేరని జనసేన పార్టీకి రాజీనామాలు చేసేసి, వైసీపికి జై అన్నారు. ఇంకా చాలా మంది అభిమానులు, శ్రేయోభిలాషులు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు.
కానీ ఆవేశం తగ్గాక మూడు రోజులు తాపీగా ఆలోచించిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ హితం కోరే మీడియా మిత్రులు చెప్పిందీ నిజమే అని అంగీకరిస్తుండటం చాలా సంతోషం.
ఇంతకాలం “వైసీపిని ఓడించాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని” గట్టిగా వాదించే పెద్దలిద్దరూ పవన్ కళ్యాణ్ మాటలు వినగానే ఉన్నపాటున వైసీపితో చేతులు కలిపేందుకు వెనకాడకపోవడం చూసి వీరాభిమానులు షాక్ అయ్యి ఉంటే ఆశ్చర్యం లేదు.
పవన్ కళ్యాణ్ తన శైలిలో చెప్పిన హితోక్తులకు వక్ర భాష్యాలు చెప్పే కాలాకేయ సైన్యం, దాని మీడియా ఉచ్చులో చిక్కుకుంటే జనసేన, దాంతో పాటు తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడు, తాము అందరం నష్టపోతామని వీరాభిమానులు గ్రహించిన్నట్లే ఉన్నారు.
అలాగని ఈ విషయంలో తాము పొరబడ్డామని చెప్పుకోనవసరం లేదు. ఎవరూ ఎవరికీ క్షమాపణలు చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే అందరికీ ఓ టార్గెట్ 24 సీట్లు ఫిక్స్ చేసేశారు. కనుక ఆ స్థానాల నుంచి పోటీ చేయబోయే మన జనసేన అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేయడానికి వీరసైనికులు అందరూ కంకణం కట్టుకొని పనిచేయాలి.
టిడిపి, జనసేనలు కలిసి అధికారంలోకి వస్తే జనసేన చరిత్రలో ఓ సరికొత్త సువర్ణాధ్యాయం మొదలవుతుందని అందరూ గ్రహించాలి. అది మరెంతో దూరం లేదు. మరో 50 రోజులు మాత్రమే ఉంది. మనం ‘జన సైనికులం.’ కనుక క్రమశిక్షణతో పట్టర పట్టు అంటూ టిడిపి, జనసేనలని శాసనసభలో కూర్చోబెడదాం. ఓకేనా?
There is a common misconception about movie collection figures. Fans often add GST to box-office…
Cinematographer Shamdat is making his Telugu directorial debut with the psychological thriller Don’t Sleep,…