2015 జనవరి 1వ తేదీన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ‘ట్విట్టర్’ను ప్రారంభించి అభిమానులకు దగ్గర అయ్యారు. సినీ సంగతులు కాకపోయినప్పటికీ, రాజకీయ అంశాలను వెల్లడించడానికి ‘ట్విట్టర్’ను ఒక ఫ్లాట్ ఫామ్ గా వినియోగించుకుంటున్నారు. మరి 2016 జనవరి 1వ తేదీ తన ఫ్యాన్స్ కోసం ఏం సిద్ధం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న పవన్ అభిమానుల మదిలో మెదులుతోంది. ‘యూ ట్యూబ్’ ఛానెల్ ఓపెన్ చేస్తారని వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ, ఇంకా ఖరారు కాలేదు. అయితే దానికి మించిన శుభవార్త పవన్ అభిమానుల కోసం వినపడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా టీజర్ సిద్ధమవుతోందని సినీ వర్గాల టాక్. నూతన సంవత్సర కానుకగా రాబోయే ఈ టీజర్ పవన్ అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతుందని సమాచారం. సమ్మర్ కానుకగా సిద్ధమవుతున్న ఈ సినిమాలో పవన్ సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే ‘లక్కీ రాయ్’ లక్ష్మీ రాయ్ ఓ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ని మించి ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.అదే గనుక జరిగితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ‘పవర్’ బాబీ కెరీర్ మరో టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లే.





