పవన్ కళ్యాణ్ పేరే నాకు ధైర్యం!

Pawan Kalyan Fan, Pawan Kalyan Fan Niharika, Pawan Kalyan Fan Tattoo, Pawan Kalyan Inspires Fan, Pawan Kalyan Fan Inspiration  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరాధించే అభిమాన గణానికి కొదవలేదు. అయితే పవన్ పేరు చెప్పి, ఇతరులకు ఇబ్బంది కలిగించే వారి కన్నా, పవన్ కళ్యాణ్ ను స్పూర్తిగా తీసుకుని జీవితాన్ని ఈదుతున్న నిహారిక లాంటి వాళ్ళు సదరు హీరోలకే గర్వకారణంగా నిలుస్తారని చెప్పవచ్చు. చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలు చవిచూసిన నిహారిక, తన అభిమాన హీరో పేరును చేతిపై పచ్చబొట్టు పోడిపించుకుంది.

20 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు తనకు బలవంతపు పెళ్లి చేశారని, అయితే, భర్త పెట్టే హింసలు తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని, కానీ, సగం కాలిన గాయాలతో బతికి బయటపడ్డానని, ఆ తర్వాత తన లాంటి వారికి ఇప్పుడు తానూ అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నానన్నారు. పవన్ కల్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్లే ఇప్పుడు తాను ఇంత ఆదరణ పొందుతున్నానని, పవన్ కళ్యాణ్ పేరే తనకు ధైర్యమని, అందుకే చేతిపై పచ్చ బొట్టు పొడిపించుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories