మండలానికి’ ఒక్కడు కాదు…’ఇంటికి’ ఒక్కడు..!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ మండలానికి ఒక నాయుడుని ఇంచార్జ్ గా నియమించి అందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను అన్నింటిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన పవన్ నామినేషన్ ప్రక్రియ వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

పవన్ ఓటమికి వైసీపీ మండలానికి ఒక నాయుడుని నియమిస్తే, పిఠాపురంలో ఇంటికొక్కడు అనేలా పవన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. దీనితో ఈ సారి పవన్ ను ఓడించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ అప్రయత్నాలుగానే మిగిలే అవకాశం ఉందంటున్నారు పిఠాపురం వాస్తవ్యులు.

ADVERTISEMENT

జనసైనికులకు తోడు, తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ వెంట కలిసి నడవడంతో పిఠాపురం రోడ్లన్నీ జనసేన, టీడీపీ జెండాలతో నిండిపోయాయి. దీనితో పవన్ గెలుపు కోసం పసుపు – కుంకుమ మాదిరి కలిసిపోయాయి టీడీపీ – జనసేన క్యాడర్. కళ్లుండి చూడలేని గుడ్డివాడి లా, చెవులుండి వినలేని చెవిటి వాడిలా, నోరుండి చెప్పలేని మూగవాడి పాత్రలో మిగిలిపోయింది సాక్షి మీడియా.

టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఇంతలా కలిసి ఒకరికోసం ఒకరు అనేలా పని చేస్తున్నప్పటికీ పవన్ కు వర్మ హ్యాండ్ ఇస్తాడు, వర్మకు పవన్ ఫ్లవర్ ఇస్తాడు అంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేసుకుంటూ ఆత్మ సంతృప్తి పొందుతుంది సాక్షి మీడియా. నామినేషన్ కార్యక్రమానికి పవన్ కు వచ్చిన ప్రజాదరణ, ప్రజా మద్దతు చూస్తుంటే ఈ సారి పవన్ అసెంబ్లీ గేటు దాటటం ఖాయంగా కనపడుతుంది.

జనసేన కూడా పవన్ విజయం పై ధీమాగా ఉంటూ ఆయన మెజారిటీ మీద ద్రుష్టి పెట్టాలని భావిస్తుంది. ఇందుకు తగ్గట్టే టీడీపీ నేత వర్మ పవన్ కు అండాదండాగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పనులు చక్కపెడుతున్నారు. పవన్ కూడా వర్మకు సముచిత స్థానం, గౌరవం కల్పించడంతో టీడీపీ శ్రేణులు కూడా పవన్ గెలుపు కోసం తమవంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు.

ఇలా పవన్ ఓటమికి మండలానికి ఒక్కరుగా బాధ్యత పంచుకున్న వైసీపీ నేతలకు పవన్ గెలుపు కోసం ఆయన వెంట మేమున్నాం అనేలా ఇంటికొక్కరుగా వచ్చి పవన్ కు మద్దతు తెలియచేసారు పిఠాపురం వాస్తవ్యలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

13 minutes ago

స్థానికం నేర్పిస్తున్న కొత్త పాఠాలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…

34 minutes ago