
ఈరోజు హైదరాబాద్‌లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. వాటిలో పాల్గొన్న ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాతృ భాష-హిందీ భాష గురించి చేసిన ప్రసంగం చాలా ఆలోచింపజేస్తుంది.
హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు.. భారతీయులుగా ఐకమత్యంతో బలపడటం.. హిందీ నేర్చుకోవడం అంటే మన మాతృ భాషని విస్మరించమని లేదా మరిచిపొమ్మని కాదు.. రెండు భాషలతో కలిసి ముందుకు సాగడం.
హిందీ భాషని రాజకీయ కోణంలో నుంచి కాకుండా, పూలదండలో దారంలా యావత్ దేశ ప్రజలను కలిపేదిగా చూస్తే ఇంత రాద్ధాంతం జరుగదు. మాతృ భాషకి తొలి ప్రాధాన్యం ఇస్తూ, కాపాడుకుంటూనే హిందీని నేర్చుకోవచ్చని ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయినా ఇతర దేశస్థులు హిందీ నేర్చుకొంటున్నప్పుడు మనం మన దేశ భాష హిందీ నేర్చుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నాము?అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలు దాటి ఉత్తరాదిలో అడుగుపెడితే హిందీలో మాట్లాడటం అనివార్యమవుతుంది. విదేశాలలో భారతీయులను కలిపేది హిందీ భాషే.
హిందీని వ్యతిరేకిస్తున్న తమిళులు, కన్నడిగులు నిజంగా వద్దనుకుంటే వారు ఎన్నటికీ తమ రాష్ట్రాలు దాటి బయటకు వెళ్ళలేరు. కనుక బయటకు వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు కష్టపడి హిందీ భాష నేర్చుకుంటున్నారు.
కానీ తమిళనాడులో రాజకీయ పార్టీలు మాత్రం హిందీని వ్యతిరేకించడం తమ పార్టీ విధానంగా మార్చేసుకున్నాయి. తమ తమిళ భాషపై అభిమానం వల్లనే హిందీని వ్యతిరేకిస్తున్నారనుకోవడానికి లేదు. దానికి బలమైన కారణమే కనిపిస్తోంది.
కేరళం, తమిళనాడు రాష్ట్రాలలో బొత్తిగా హిందీ లేకపోవడం వలననే ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్, బీజేపీలు దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్నా ఆ రాష్ట్రాలలో అడుగుపెట్టలేకపోతున్నాయి.
కానీ హిందీ కాస్త బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు చొచ్చుకుపోగలిగాయి. కనుక ద్రవిడ పార్టీల హిందీ వ్యతిరేకతకి బలమైన రాజకీయ కారణం కూడా ఉందని స్పష్టమవుతోంది.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాదికి వలస వచ్చి స్థిరపడినవారు చక్కగా మన భాషలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సుఖంగా మనుగడ సాగించాలంటే ఇక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలను అర్దం చేసుకోవడం చాలా అవసరమే కనుక!
ఇదేవిదంగా విదేశాలలో స్థిరపడాలనుకునే భారతీయులు జర్మన్, ఫ్రెంచ్, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్ ట్యూషన్లు పెట్టించుకొని, కోచింగ్ క్లాసులకు హాజరయ్యి మరీ నేర్చుకుంటున్నారు. జర్మన్ లేదా అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా గొప్పగా భావిస్తున్నప్పుడు హిందీ భాష నేర్చుకోవడానికి నామోషీ, అభ్యంతరం దేనికి?హిందీలో మాట్లాడితే గౌరవం పేరుగుతుందే కానీ తగ్గిపోదు కదా?
కనుక రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాల కొరకు హిందీని వ్యతిరేకిస్తుంటే, ప్రజలు కూడా గుడ్డిగా హిందీ లేదా మరో భాషని వ్యతిరేకించడం మానుకోవాలి. ఎవరి భాష వారికి గొప్పదే. కానీ ఇతర భాషలు కూడా తక్కువ కావు. ఒకప్పుడు తెలంగాణ, రాయలసీమ, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం భాష, యాస అవహేళనకు గురయ్యేవి. కానీ ఇప్పుడు అదే యాస, భాషలో సినిమాలు తీస్తే హిట్ అవుతున్నాయి కదా?అంటే ఇంతకాలం వాటి గొప్పదనం గుర్తించలేనందునే కదా? అలాగే హిందీ కూడా!
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…