బాబు ఫాన్స్ కి ‘గూజ్బంప్స్’ ఇచ్చిన జనసేనాని..!

సిద్ధం సిద్ధం అంటూ ఇన్నాళ్ళుగా తన గెలుపుకి వాలంటీర్లను, నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను, తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైస్ జగన్ కు యుద్ధం తాలూకా విధ్వంశం ఎలా ఉంటుందో జెండా సభలో జస్ట్ శాంపిల్ చూపించారు జనసేనాని పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు.

పొత్తు అంటూ ముందడుగు వేసిన ఇరు పార్టీల అధినేతలు అసలు పొత్తు ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేది ఈ సభ ద్వారా ఇరు పార్టీల కార్యకర్తలతో పాటుగా వైసీపీ క్యాడర్ కు కూడా బలంగా చాటి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ బాబు.., అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన బాబు పడ్డ కష్టాన్ని, శ్రమను గుర్తిస్తూ పవన్ ఒకరి పై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ADVERTISEMENT

40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆ పార్టీతో పోటీ పడి మనం పోల్ మేనేజ్ మెంట్ చేయగలమా..? సంస్థాగతంగా పాతుకు పోయిన టీడీపీ తో మనం పోటీ పడగలమా..? మనకు ఆర్గనైజేషన్ బలముందా..? ప్రతి నియోజకవర్గం నుంచి 800 నుంచి 1000 మంది బూతు కార్యకర్తలు ఉన్నారా మనకు..? వారిని 50 రోజుల పాటు పోషించే ఆర్థిక బలముందా మన పార్టీ నాయకులకు..? అంటూ పార్టీకి 24 సీట్లేనా అంటున్న వారిని ప్రశ్నించారు జనసేనాని.

జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. అటువంటి నాయకులను తయారు చేసుకునే లోపు వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి టీడీపీ పార్టీతో పొత్తు అనివార్యం. అలాగే చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్ అవసరం రాష్ట్రానికి ఉంది. ఆయన విజనరీ వైసీపీ పాలనతో చీదరమైపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఎంతో అవసరం.

బాబు సీఎం గా ఉన్న సమయంలోనే క్లైమర్ మైన్ తో ఆయన వస్తున్న జీప్ పై తిరుపతిలో దాడి జరిగి ఆ జీప్ 16 అడుగులు ఎత్తున లేస్తే..,లేచి ‘చొక్కా దులుపుకుని’ పదండి రాజకీయం చేద్దామని నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న దురంధరుడు చంద్రబాబు.

అటువంటి నాయకుడితో కలిసి ముందుకెళ్లడం ఎప్పటికి తప్పు నిర్ణయం కాదు. ఇప్పటి సీఎం గా ఉన్న జగన్ పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి తనకు ఓట్లేసి ప్రజల మధ్యకు వస్తుంటే బాబు మాత్రం తన పై జరిగిన దాడిని కూడా లెక్కచేయకుండా ప్రజాసేవకై అడుగు ముందుకు వేసాడు.

తన ప్రత్యర్థుల మీదకు ‘చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ తన సైన్యానికి హింట్ ఇస్తున్న నాయకుడ్ని ఇప్పటి తరం చూస్తుంటే తనపై క్లైమోరే మైన్ తో దాడి జరిగిన ‘చొక్కా దులుపుకుని’ వెళ్లి పోయిన నాయకుడ్ని ఆ తరం చూసింది అంటూ పవన్ బాబు గురించి , బాబు పై జరిగిన దాడి గురించి, రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఆసక్తి గురించి, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్దత గురించి సభలో చెప్పి బాబు అభిమానులకు ఒక్కసారిగా గూజ్బంప్స్ తెప్పించారు.

అందుకే లోకేష్ ఎప్పుడు జగన్ – బాబు ని ఉద్దేశించి ‘ఒక విజనరీ కి ఒక ప్రిజనరీ కి’ ఉన్న తేడా తెలుసుకోండి అంటూ వ్యాఖ్యానిస్తుంటారు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. జనేనని మాటలతో వేదిక మీద ఉన్నవారితో పాటుగా బాబు కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఒకరి పై ఒకరు నిప్పులు కురిపించుకోవాలి అని వైసీపీ చూస్తుంటే ఇక్కడ మాత్రం ఒకరి పై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకున్నారు. దీనితో వైసీపీ కళ్ళల్లో నిప్పులు కురవడం మొదలు అంటున్నారు ఇరు పార్టీల క్యాడర్.

Photos: TDP-Janasena Mega Meeting Highlights

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

7 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

8 hours ago