
ఇవాళ్ళ టీడీపి, జనసేన, బిజేపి మూడు పార్టీల అధ్యక్షులు సమావేశమై సుదీర్గంగా చర్చించిన తర్వాత ముగ్గురూ మీడియా సమావేశంలో మాట్లాడారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తిరుమలలో వరుసగా జరిగిన అపచారాలన్నిటినీ చూస్తున్నప్పుడు వీళ్ళు (వైసీపీ వాళ్ళు) పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?వాళ్ళు మన భగవంతుడిపై ఎందుకు ఇంతగా పగ పట్టారు? అని మేము లోతుగా పరిశీలించాల్సి వస్తోంది.
ఎవరైనా మరో వర్గం మీదనో మరో పార్టీ మీదనో పగ బట్టడం సహజం. కానీ భగవంతుడిపై పగ పట్టడం ఏమిటో మాకు అర్థం కాలేదు. మనం ఏడు కొండలని భక్తితో అనుకుంటాము. కానీ వీళ్ళు మీకు రెండు కొండలు చాలంటారు. దీనిని (వైసీపీ వాళ్ళ ఈ ఆలోచనా ధోరణిని) మేము సరిచేయాలనుకుంటున్నాము,” అని అన్నారు.
దేవుడిపై పగ ఎందుకు? అని పవన్ కళ్యాణ్ అడిగిన చిన్న ప్రశ్న ఆలోచింపజేస్తుంది. వైసీపీ అధినేత జగన్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ అన్యమతస్తులే. కనుక వారు అధికారంలో ఉన్నప్పుడు తమ మతస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా సహజమే. కానీ అది అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే కధ నేడు ఇంతదాకా వచ్చేదే కాదు.
ప్రజలు అయన మతాన్ని కాక వైఎస్సార్ కొడుకుగానే చూసి అందలం ఎక్కించారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలిస్తారని ప్రజలు ఆశించారు.
కానీ వైసీపీ అధినేత జగన్ అజెండా వేరే ఉందనే విషయం ఆయన పదవి చేపట్టిన రెండు మూడు రోజులకే అర్దమైంది. ఆ అజెండాలో పాలన, రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి.
వైసీపీ అజెండాలో అత్యంత ప్రాధాన్యం దేనికంటే, శాశ్వితంగా రాజ్యాధికారం, దాని కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు, దాని కోసం అవినీతికి పాల్పడుతూ భారీగా సొమ్ము సిద్ధం చేసుకోవడం, దాని కోసమే ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేయడం వంటివి ఉన్నాయి.
ప్రాధాన్య క్రమంలో రెండోది హిందూమత, తెలుగువారి సాంస్కృతిక విధ్వంసం. దానిలో భాగంగానే టిటిడీని అన్యమతస్తులకు అప్పగించారు. వారందరూ నామాలు పెట్టుకొని స్వామివారిని భక్తులను మోసం చేశారు. ఎందుకంటే వారెవరికీ హిందూమతం, స్వామివారిపై భక్తి, నమ్మకం లేదు కనుక.
అందువల్లే వారు తిరుమలని గొప్ప ఆదాయ వనరుగా మాత్రమే చూసి, పరకామణి, స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, పట్టువస్త్రాలతో అందినకాడికి దండుకున్నారు.
వైసీపీ హయంలో మత మార్పిడులు, హిందూ దేవాలయాలు, హిందూ దేవతా విగ్రహాలపై దాడులు, ఆలయాలలో దొంగతనాలు, అపచారాలన్నిటికీ ప్రధాన కారణం రాష్ట్రంలో తమ మతాన్ని వ్యాపింపజేయాలనే దురాలోచనే కనిపిస్తోంది. వైసీపీ హయంలో వినాయక చవితికి ఆంక్షలు విధించడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
తెలుగు భాష విద్వంసం కూడా దీనిలో భాగమే. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళన్నీ దశాబ్దాలుగా తెలుగు భాషని ఓ పద్దతి ప్రకారం హత్య చేశాయంటే అతిశయోక్తి కాదు. తెలుగు భాషని ప్రభుత్వ పాఠాశాలలు కాపాడుకొస్తున్నాయి. జగన్ సిఎం అయిన తర్వాత వాటినీ ఇంగ్లీష్ మీడియంగా మార్చేశారు. దేనికో అర్ధమవుతోంది కదా?
ఒక జాతి ఉనికిని తెలియజేసేవి వాటి కులం, మతం, భాష, సంస్కృతి, సంప్రదాయాలే. ఆ ఉనికినే చెరిపేస్తే? అదే చేయాలనుకున్నారు… చేశారు.
మరో పదేళ్ళు వైసీపీ అధికారంలో ఉండి ఉంటే అప్పుడు ఏపీలో హిందువులు, తెలుగు మాట్లాడేవారు, దేవాలయాలు ఉండేవి కావేమో?
కనుక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వైసీపీ వాళ్ళు దేవుడిపై పగ పట్టలేదు. ఓ పద్దతి ప్రకారం నిర్మూలన కార్యక్రమం చేపట్టారని భావించవచ్చు.
వైసీపీ హయంలో రాష్ట్రంలో ఇన్ని అపచారాలు, అనర్ధాలు జరుగుతున్నా హిందూమతంపై పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే బిజేపి పెద్దలు పట్టించుకోలేదు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తానేమీ సరదాగా కాషయ వస్త్రాలు ధరించడం లేదని, తానేమీ కాలక్షేపానికి సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదని స్వయంగా చెప్పారు.
కనుక కనీసం ఇప్పటికైనా ఈ హిందూమత, తెలుగు సాంస్కృతిక విధ్వంసాన్ని నాశనం చేయాలనుకునేవారిని సరిచేస్తే బాగుంటుంది. లేకుంటే సనాతన ధర్మం జస్ట్ ఫ్యాషన్ షోగా మిగిలిపోతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…