Telugu

పాపం పసివాడు… పవన్‌ ర్యాగింగ్ మామూలుగా లేదుగా!

క్రికెట్‌లో తమ ప్రత్యర్ధులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వారిపై పైచేయి సాధించేందుకు కొందరు క్రికెటర్లు స్లెడ్జింగ్‌ చేస్తుంటారు. దానినే మన రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకొని తమ ప్రత్యర్ధులను ‘పొలిటికల్ ర్యాగింగ్’ చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని ‘దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్’ అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో ఎమ్మెల్యేల వరకు అందరూ పదేపదే ఎద్దేవా చేయడం పొలిటికల్ ర్యాగింగే. అదేవిదంగా టిడిపి నేతలు సిఎం జగన్‌ను ఉద్దేశ్యించి ‘సైకో..సైకో పాలన…’ అంటూ చేసేది, ‘బాబాయ్ అబ్బాయ్ గొడ్డలి వేటు’ అంటూ చేసేది కూడా ఇటువంటిదే. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి 1972లో విడుదలైన ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌తో ట్విట్టర్‌లో పొలిటికల్ ర్యాగింగ్’ చేశారు.

ADVERTISEMENT

ఆ సినిమాలో రాము అనే పసివాడు హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఎడారిలో చిక్కుకొంటాడు. ఆరోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆ సినిమాను ప్రస్తావిస్తూ పవన్‌ కళ్యాణ్‌ చాలా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ ఏం ట్వీట్‌ చేశారంటే, “మన ముఖ్యమంత్రిగారిని హీరోగా పెట్టి మళ్ళీ ఎవరైనా ఈ సినిమా చేస్తారని ఆశిస్తున్నాను. ఆ సినిమాలో పసివాడులాగే ఈయన కూడా చాలా అమాయకుడు. అయితే ఆయనతో చేయాలంటే సినిమాలో చిన్న మార్పు చేయాల్సి ఉంటుంది. సినిమాలో పసివాడి చేతిలో ఒక్క సూట్ కేస్ మాత్రమే ఉంది. కానీ మన ముఖ్యమంత్రిగారితో తీస్తే సూట్‌కేసు కంపెనీలను పెట్టి తీయాల్సి ఉంటుంది. వాటితో ఆయన అక్రమంగా చాలా ఆస్తులు పోగేసుకొన్నారు.

ప్రియమైన ముఖ్యమంత్రిగారు, మీరు ‘చారిత్రాత్మకమైన యుద్ధం’ గురించి మాట్లాడేందుకు మీరేమీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెళ్ళ నాగిరెడ్డి కాదు. అక్రమాస్తులను పోగేసుకొని, ప్రజల మద్య చిచ్చు పెడుతున్న మీకు ‘చారిత్రాత్మకమైన యుద్ధం’ అనే మాట పలికే అర్హత కూడా లేదు. ఏదో ఓరోజు మీరు, మీ నేతల కబందహస్తాల నుంచి రాయలసీమ విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను.

‘పాపం పసివాడు’ సినిమా తీయాలనుకొంటే రాజస్థాన్‌ ఎడారిలో ఇసుక అవసరం ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రిని పెట్టి ఈ సినిమా తీయదలిస్తే ఇసుక కోసం వెతుక్కోనవసరం లేదు. ఎందుకంటే వైసీపీ నేతలందరూ ఇసుక దోపిడీ చేసి గుట్టలు గుట్టలుగా పోసుకొంటున్నారు కదా… ఛీర్స్!!” అని ట్వీట్‌ చేశారు.

ఆ సినిమాలో పసివాడు ఎడారిలో ఒంటరిగా చిక్కుకుపోగా, జగన్‌ తాను కూడా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయానని కనుక మీరే నాకు తోడుగా నిలవాలంటూ ‘బటన్ నొక్కుడు’ సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sharmila Slams TDP and YSRCP Over Violence During AP Municipal Elections

Political tensions are rising in Andhra Pradesh as clashes continue during the municipal election nomination…

12 minutes ago

Varanasi Release in Doubt? Prabhas’ Fauzi May Benefit

SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…

42 minutes ago