
ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైఖరిని తప్పుబట్టినా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించినా…దానికి సమాధానంగా ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుండి ఆ పార్టీ కార్యకర్త వరకు ప్రశ్నించిన నేతల పైన వారి కుటుంబం పైన వ్యక్తిగత దాడికి పాల్పడుతుంటారు.
ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి పవన్ కానీ, చంద్రబాబు కానీ, చెల్లెల్లు షర్మిల, సునీతా కానీ వ్యక్తులు ఎవరైనా వైసీపీ సమాధానం ఒక్కటే. పవన్ అయితే మూడు పెళ్లిళ్లు అంటూ జవాభిస్తారు. బాబు అయితే వెన్నుపోటు అంటూ మాట దాటేస్తారు. షర్మిల అయితే వైస్ కాదు మురుసుపల్లి , రెడ్డి కాదు శాస్త్రి అంటూ, సునీత అయితే ఆస్తి కోసం తండ్రి చావుకి కారణమైనా వ్యక్తి అంటూ ఇలా ప్రతిపక్షాల ప్రశ్నలు పాలసీ విధానాల మీద ప్రభుత్వ పాలన మీద ఉంటే అధికార పార్టీ సమాధానాలు వ్యక్తిగత విషయాల చుట్టూ తిరుగుతాయి.
అయితే నిన్న జగన్ మేమంతా సిద్ధం సభలో పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ అదే మూడు పెళ్లిళ్లు, మూడు పెళ్ళాల చుట్టూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. పెళ్ళాల మాదిరే నియోజకవర్గాలు కూడా మారుస్తున్నాడు అంటూ భీమవరం నుండి ఇప్పుడు పిఠాపురంకు మకాం మార్చాడు అంటూ పవన్ ను ఎద్దేవా చేసారు. అసలు పవన్ ఎందుకు నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చిందో చెప్పాలంటూ ప్రశ్నించారు జగన్.
జగన్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా జగన్ మాదిరి వ్యక్తిగత దాడి కానీ, వైసీపీ పార్టీ తరహా తప్పుడు విమర్శలు కానీ చెయ్యకుండా జగన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జవాబు చెప్పలేని కౌంటర్ ప్రశ్న సంధించారు పవన్. నేను భీమవరం నుండి ఎందుకు మారానో చెప్పాలంటున్న జగన్ గారు వైసీపీ పార్టీ తరుపున పోటీ చేస్తున్న 75 నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు ఎందుకు చేసారో చెప్పగలరా..? అంటూ ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 9 సార్లు కరెంట్ చార్జీలను పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రజల మీద పన్నుల భారాన్ని మోపారు, పెట్రోల్, డీజిల్ ఇలా అన్నింటి మీద బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టి బటన్ నొక్కుతున్నా ఓటేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలలోకి వచ్చాడు. జగన్ బటన్ నొక్కడానికి ఎంతో మంది మధ్యతరగతి ప్రజల గొంతు నొక్కుతున్నారు. నోరుందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ కు పెడన సభ సాక్షిగా కౌంటర్ వేశారు పవన్.
Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…