
మరో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి, ఉంటుంది అంటూ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఒక బలమైన సంకల్పం చేసుకున్నారు.
అదే విధంగా ఆ సంకల్పనానికి కట్టుబడే తన రాజకీయ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తన పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు ఆ సంకల్పానికి కట్టుబడే రాజకీయం చెయ్యాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు.
నాడు బాబు అరెస్టుతో ఒక్కటైనా టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయనే చెప్పాలి. 151 సీట్లతో ప్రభుత్వంలో ఉన్న వైసీపీ వై నాట్ 175 అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద కథం తొక్కుతున్న సమయంలో హలో ఏపీ..బై బై వైసీపీ అంటూ పవన్ కథ నడిపించారు.
అలాగే వైసీపీ ని అదః పాతాళానికి తొక్కుతా, జగన్ ను గద్దె దింపుతా అంటూ నాడు జనసేన చేసిన సంకల్పం వైసీపీ ని 11 కి పరిమితం చేసింది. ఇక మరో పదేళ్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దే అధికారం, బాబే ముఖ్యమంత్రి అంటూ పవన్ చేస్తున్న సంకల్పం నేడు వైసీపీ భవిష్యత్ కి శాపం కానుందా.?
ఈ మూడు పార్టీల కలయిక వైసీపీ ని రాజకీయంగా పాతాళానికి తొక్కడంతో జనసేన సంకల్పం ఏపీ రాజకీయాలలో వైసీపీ స్థాయిని, స్థానాన్ని నిర్దేసించగలుగుతుందా అన్న చర్చ జరుగుతుంది. తాజాగా జనసేనాని సంక్రాంతి వేడుకల పర్యటనలో కూడా పవన్ ఈ మూడు పార్టీల పొత్తు పై, ఆ పొత్తుకు కట్టుబడ్డ అధినేతల నిర్ణయం పై మరోమారు తన బలమైన సంకల్పాన్ని బయటపెట్టారు.
ఏపీ పారిశ్రామికంగా,సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే అందుకు అనుభవం ఉన్న నాయకుడు తప్పనిసరి అని, అందుకు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కూటమి మద్దతుదారులకు ఒక స్పష్ట ఇచ్చారు. అలాగే వైసీపీ కి పరోక్ష హెచ్చరిక పంపారు.
మరో పదేళ్లు ఈ మూడు పార్టీలు తమ పొత్తులకు కట్టుబడి రాజకీయంగా అడుగులు వేస్తె ఏపీలో జగన్ 2.0 సాధ్యమా.? వైసీపీ రప్ప రప్ప రాజకీయానికి ఛాన్స్ వస్తుందా.? వైసీపీ మరోసారి అధికారానికి దూరమైతే జగన్ ను కవచంలా కాపాడుతున్న కొంతమంది సోకాల్డ్ నేతలు వైసీపీ వెన్నంటి ఉంటారా.?
లేక సాయి రెడ్డి మాదిరి రాజకీయ నాయకుడి నుండి రైతుగా మారిపోతారా.? ఇప్పటికే కొడాలి అజ్ఞాతంలోకి వల్లభనేని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు.ఇక సజ్జల, పెద్ది రెడ్డి, పెద్దా రెడ్డి వంటి వారు అవసరం మేరకు మాత్రమే మీడియాలో కనిపిస్తూ ఆ పై తెరచాటుకెళిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన సంకల్పం మరోమారు కార్యరూపం దాల్చితే అది వైసీపీ కి శాపమే అవుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…