‘సర్ధార్’ సెన్సార్ పూర్తి కాలేదు!

sardaar gabbar singh completes censor – gets UAఅవును… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ‘యు/ఎ’గా పిలవబడుతున్న “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలో ఇంకా రెండు పాటలు చేర్చాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాటలను స్విట్జర్లాండ్ లో పవన్ నేతృత్వంలో చిత్రీకరణ జరుపుతున్నారు. అంటే మొత్తం సినిమా సెన్సార్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది.

ADVERTISEMENT

సినిమా విడుదల ఏప్రిల్ 8వ తేదీగా డిక్లేర్ చేయడంతో ఆ రెండు పాటలను ఎప్పుడూ జత చేరుస్తారు… అన్న ప్రశ్నలు సగటు పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఏప్రిల్ 2వ తేదీన మిగిలి ఉన్న ఆ రెండు పాటలు కూడా సెన్సార్ ముందుకు వెళ్లనున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ తో ‘సర్ధార్’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి.

ఇక, ఆదివారం నుండి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడానికి ప్లానింగ్ కూడా సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్లాన్ చేసారని, ఈ ప్రభావం టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టే విధంగా రంగం సిద్ధమవుతోందట.

ADVERTISEMENT
Latest Stories