బాబోయ్… “సర్ధార్” ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు..!

Pawan kalyan-Sardaar Gabbar Singh‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధియేటర్లలో ప్రత్యక్షం కావడానికి మరో 72 గంటల సమయం ఉంది. అయితే సోషల్ మీడియాలో గంట గంటకూ విడుదల అవుతున్న ‘సర్ధార్’ పోస్టర్స్ ను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. నిముషాలు లెక్కపెట్టుకుంటూ ఇప్పటికే రికార్డు స్థాయిలో బుక్కైన అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం వేరే దారులలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇంతకీ అభిమానులను ఇంతగా ఉత్సాహపరుస్తున్న అంశాలేంటి… అంటే… దానికి సమాధానం ఒకే ఒక్కటి పవన్ కళ్యాణ్ అన్న పేరు..!

ADVERTISEMENT

పోలీస్ పాత్రలో పవన్ యారోగెంట్ స్టిల్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతుండగా, బుల్లితెరపై వదులుతున్న చిన్న చిన్న టీజర్లలోని డైలాగ్స్ పవన్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో, ‘సర్ధార్’ను ఎప్పుడెప్పుడు వెండితెరపై వీక్షించేయాలా అన్న ఆతృతలో పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పంచె కట్టులో కనపడుతున్న పవర్ స్టార్ లుక్స్ ధియేటర్లలో ఫ్యాన్స్ చేత కేకలు పెట్టించడం ఖాయంగా కనపడుతోంది.

అలాంటి పంచె కట్టు పోస్టర్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. పంచె కట్టుతో కాలు మీద కాలు వేసుకుని పవన్ కూర్చున్న తీరు… కుర్చీకి ఎర్ర కండువాతో రేడియోను కట్టిన తీరు… అలాగే పవన్ ఎదురు కూర్చున్న రౌడీలను చూస్తుంటే ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఇలాంటి స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంటే… పవన్ ఫ్యాన్స్ ఎలా తట్టుకోగలరు… టికెట్ల కోసం ఎగబడడం తప్ప..!

ADVERTISEMENT
Latest Stories