వకీల్ సాబ్ అసలు కథ ఇప్పుడే మొదలు

Pawan Kalyan Sathyameva Jayatheపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా అధికారిక రీమేక్ ఈ సినిమా. ముగ్గురు యువతులకు న్యాయం చేసే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక వృద్ధ లాయర్.

ADVERTISEMENT

అయితే వకీల్ సాబ్ కు హీరోయిన్ కూడా ఉంటుంది. ఒక డ్యూయెట్ కూడా ఉంది. మొన్న ఆ మధ్య సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేసిన ఆ టీజర్ లో అసలు కథ పూర్తిగా మరుగునపడిపోయిందని విమర్శలు వచ్చాయి. అయితే చిత్ర బృందం ఇప్పుడు ఆ కొరత తీర్చేలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తుంది.

సినిమాకు సంబంధించిన కొత్త పాట ‘సత్యమేవ జయతే’ మార్చ్ 3న సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యనున్నారు. ఈ పాట చిత్రం కథ థీమ్ కు అనుగుణంగా ఉంటుంది. దానితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనుగుణంగా కాకుండా కథ అనుగుణంగా ప్రమోషన్లు మొదలుపెట్టనున్నారు.

పింక్ నిర్మాత బోనీ కపూర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తెలుగులో నిర్మాతగా అరంగేట్రం చెయ్యబోతున్నారు. దిల్ రాజు ఇంకో నిర్మాత. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. థమన్ మొట్టమొదటి సారిగా ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories