“హుషారు” సినిమాతోనే పవన్ కళ్యాణ్ ‘బదులు’

Pawan-Kalyan-SJ--Surya--Husharuతను రెండున్నర్రేళ్ళ పాటు కష్టపడి రాసుకున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా కధ చాలా పేలవంగా ఉందని, ఈ కధకు అంత సమయం ఎందుకంటూ పవన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇలాంటి విమర్శలతో పాటు ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల పాలయ్యారనే టాక్ బలంగా వినపడుతున్న నేపధ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

అయితే సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన తదుపరి సినిమా “హుషారు”ను తక్కువ ధరకు విక్రయించి ‘న్యాయం’ చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ధికంగా ప్రస్తుతం నష్టాలను పూడ్చేటంత బలంగా లేకపోవడంతో తదుపరి సినిమాపైనే ఆధారపడ్డారని టాక్.

ADVERTISEMENT

వరుసగా సినిమాలు అంగీకరించిన పవన్, తదుపరి చిత్రంగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో ‘హుషారు’ ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇవి కాకుండా దాసరి బ్యానర్లో మరో సినిమా ఉండనుంది. అయితే ‘సర్ధార్’ సినిమాకు వెల్లువెత్తిన విమర్శలను, నష్టాలను తన ‘హుషారు’తోనే బదులు చెప్పేందుకు పవన్ డిసైడ్ అయినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories