Telugu

వైసీపీ బలమే మన బలహీనత: పవన్ కళ్యాణ్‌

డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ నేడు శాసనసభలో మాట్లాడుతూ వైసీపీ, కూటమి ప్రభుత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

“వైసీపీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ వాళ్ళు 1100 మంది ఉన్నట్లు ధాటిగా మాట్లాడుతుంటారు. వారు ఏం చెప్పినా పూర్తి నమ్మకంతో మాట్లాడుతుంటారు. ఏం చేసినా కలిసికట్టుగా చేస్తుంటారు.

ADVERTISEMENT

ఉదాహరణకు నెయ్యి కల్తీ చేసింది వాళ్ళే. కానీ మేము చేయలేదు మీరే చేశారని అందరూ గట్టిగా ముక్త కంఠంతో వాదిస్తుంటారు. అబద్దాన్ని నిజమని నమ్మించే వరకు వాళ్ళు దేనినీ విడిచిపెట్టరు. అదే వారి బలం,” అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

కానీ మన ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా చెప్పుకోలేకపోతోంది. కనీసం వైసీపీ ధీటుగా ఎదుర్కోలేకపోతోంది. మన మద్య చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు సాగుతూనే ఉండాలి. వైసీపీలా మూడు పార్టీలు కూడా ఒకే గొంతుగా బలంగా వినిపించాలి,” అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

కూటమికి తిరుగులేని మెజార్టీ ఉంది. ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలం ఉన్నారు. మూడు పార్టీలకు కొమ్ములు తిరిగిన నేతలున్నారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మూడు పార్టీల మద్య సఖ్యత కూడా ఉంది. ప్రభుత్వం చేతిలోనే అధికారం, యంత్రాంగం ఉంది. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ముగ్గురికీ కేంద్రంలో మంచి పలుకుబడి సత్సంబంధాలున్నాయి. ఇద్దరు టీడీపి కేంద్ర మంత్రులున్నారు. వారికి సాటి కేంద్ర మంత్రులతో మంచి సఖ్యత ఉంది.

ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, అనేక కేసులలో చిక్కుకున్న వైసీపీ ఎదురుదాడి చేస్తుంటే కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతీసారి వైసీపీ చేసే ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకోవడంతోనే సరిపోతోంది. లేదా ఎప్పటికప్పుడు జగన్‌ రచించే కొత్త కొత్త అనూహ్యమైన వ్యూహాలను ఎదుర్కోవడానికే సరిపోతోంది. వై?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mouli’s Donga Naa Koduku Gets Release Date

Mouli has become a familiar name through his social media work, web series and Little…

15 minutes ago

Venkatesh Maha’s Attahaasam Set for Summer 2027

Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…

34 minutes ago