
అంత బ్లాక్ బస్టర్ విజయంలో ‘తొలిప్రేమ’ సినిమాలోని పాటలు కూడా కీలకపాత్ర పోషించాయి. దేవా స్వరాలు సమకూర్చిన నాటి “తొలిప్రేమ” ఇప్పటికీ యువతరం పెదాలపై పాడుతూనే ఉంటారు. మరి అంతటి బ్లాక్ బస్టర్ ఆడియోను లేటెస్ట్ గా రాబోతున్న “తొలిప్రేమ” అందుకుంటుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఎస్.ఎస్.థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించి, తనపై వచ్చిన, వస్తున్న విమర్శలకు గట్టి బదులిచ్చారు.
మరో విధంగా చెప్పాలంటే… పవన్ “తొలిప్రేమ” కంటే వరుణ్ “తొలిప్రేమ”ను ఒక మెట్టు పైనే నిలిపాడు థమన్. ఎందుకంటే… పవన్ “తొలిప్రేమ” పాటలు ఎంత సూపర్ హిట్ అయినా, అవి ‘కాపీ’ అన్న విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రికీ మార్టిన్ పాటలను తెలుగులోకి తర్జమా చేసిన పాటలు అద్భుతంగా ఉన్నా, అవి ‘కాపీ’ అన్న ముద్ర వేయించుకున్నాయి. ఈ విషయంలో థమన్ ‘కాపీ’ అన్న పదానికి దూరంగా ఇవ్వడం, అవి కూడా ప్రజెంట్ ‘ట్రెండ్’కు తగిన విధంగా ఉండడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
అంతకుముందు థమన్ పై కూడా ఈ ‘కాపీ’ ముద్రలు వెల్లువెత్తాయి. అయితే ఈ “తొలిప్రేమ”తో వాటికి కూడా సమాధానం చెప్పినట్లయ్యింది. ఏ రకంగా చూసుకున్నా థమన్ కెరీర్ లో ఈ “తొలిప్రేమ” కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లో కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో ది బెస్ట్ ఆల్బమ్ గా “తొలిప్రేమ” సంగీత ప్రియుల నీరాజనాలు అందుకుంటోంది. ఆడియో సూపర్ హిట్ కావడంతో, వీడియోపై అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ మాదిరే వరుణ్ కెరీర్ లో కూడా “తొలిప్రేమ” ది బెస్ట్ మూవీగా నిలిచిపోవాలని ఆశిద్దాం.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…