
బుదవారం ఉదయం అన్నవరం చేరుకొని సత్యనారాయణ స్వామివారిని దర్శించుకొన్న తర్వాత అక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల పర్యటన ప్రారంభిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్ముడివరం, రాజోలు, పి.గన్నావరమ్, నరసాపురం నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతుండటంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యలగా జిల్లా ఎస్పీ అమలాపురంలో ఆంక్షలు విధించారు. అయితే పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం కోసమే పోలీసులు ఆంక్షలు విధించారని మీడియాలో వార్తలు వస్తుండటంతో కోనసీమ, అమలాపురం ఎస్పీలు జనసేన నేతలతో నిన్న సమావేశమై పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్, బహిరంగసభలు నిర్వహించబోయే ప్రదేశాల గురించి చర్చించారు. రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు జరుగుతున్నప్పుడు సెక్షన్ 30 విధించడం సర్వసాధారణమే అని, పవన్ కళ్యాణ్ యాత్రను, సభలను అడ్డుకొనే ఉద్దేశ్యం తమకు లేదని వారు స్పష్టం చేశారు. అయితే నిర్వాహకులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాము కూడా జాగ్రత్తలు తీసుకొనున్నామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ యాత్రకు పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేవని స్పష్టం అవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరంలో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటించే మార్గంలో ఆయనకు స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు, తోరణాలు కట్టారు. ఉభయగోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు.
అప్పుడే అంబటి రాంబాబు తదితరులు కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కు నమస్కార బాణాలువేస్తూ స్వాగతం పలుకుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఏపీలో రెండు సభలు నిర్వహించేసి జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోసి, బిజెపికి ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధించి వెళ్లారు. కనుక పవన్ కళ్యాణ్‌దే ఆలస్యం… వచ్చి ఏం చెపుతారో?
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…