నటి పాయల్ రాజ్‌పుత్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఓ విలేఖరి ఇటీవల కాలంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ ‘మీరు జైపూర్‌లో విపాసనలో చేరారట కదా?” అని అడిగాడు.
ఆ ప్రశ్నతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తానూ ఎంతగానో ప్రేమించే తండ్రికి క్యాన్సర్.. ఆ వ్యాధితో అయన చనిపోవడంతో అంతులేని బాధ… ఓ వైపు తల్లి గురించి దిగులు, మరో వైపు తన కెరీర్ గురించి ఆందోళనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాయని చెపుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఈ ఒత్తిళ్ళని అధిగమించేందుకే తాను విపాసన ధ్యాన కేంద్రంలో చేరి శిక్షణ తీసుకున్నానని చెప్పారు. కానీ మళ్ళీ తండ్రి మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ధైర్యంగానే ఉన్ననంతూనే కన్నీళ్ళు ఆపుకోలేక వేదికపైనే ఏడ్చేశారు. చుట్టూ ఉన్నవారు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె అటువంటి స్థితిలో కార్యక్రమంలో పాల్గొనలేక వేదిక దిగి వెళ్ళిపోయారు.
వివిధ రంగాలలో పని చేసే మహిళలు తమని తాము నిరూపించుకోవడానికి, ఓ స్థాయికి ఎదగడానికి, ఎదిగి ఆ స్థానం నిలుపుకోవడానికి పురుషులతో పోలిస్తే మరింత కష్టపడాల్సి వస్తుంది. తమ కంటూ గుర్తింపు సంపాదించుకొని ఓ స్థాయికి చేరినా ఇటువంటి సమస్యలు, ఒత్తిళ్ళు, సోషల్ మీడియాలో వేధింపులు వంటివి భరిస్తూనే ఉండాలి. అయినా నూటికి నూరు శాతం సమర్దతతో పని చేయాలి.
అన్ని రంగాలలో పురుషులతో మాత్రమే కాదు.. సాటి మహిళలతో కూడా పోటీ పడుతూనే ఉండాలి. వేధింపులు, ఒత్తిళ్ళు భరిస్తూనే ఉండాలి. చివరికి సొంత కుటుంబంలో కూడా తప్పించుకోలేరు!
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ప్రశ్న అడగడం సాధారణ విషయమే అనిపించవచ్డాచు. కానీ ఇలాంటి హీరోలను, ముఖ్యంగా.. పెద్ద హీరోలని ఇటువంటి ప్రశ్న అడిగే సాహసం చేయగలరా? అంటే కాదనే తెలుసు. వాళ్కాళని అడగలేని ప్రశ్నలు మహిళా నటులనే దేనికంటే వాళ్ళు మహిళలు.. సెలబ్రిటీలు కనుక అనుకోవాలేమో?
ఏది ఏమైనప్పటికీ ఆమె వంటివారు అనేక మంది ఉత్తరాది లేదా దక్షిణాది రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో అందరితో పోటీ పడుతూ నటించి మెప్పించడం మామూలు విషయం కాదనే విషయం ఎంత మంది గ్రహిస్తారు? ఆమె వంటి వారి పట్ల చులకనగా మాట్లాడుతున్నారు తమ తమ రంగాల్లో రాణించారా? ఆ స్థాయిలో గుర్తింపు పొందగాలిగారా? అని ఆలోచించాలి.
‘ఫస్ట్ టైం 01.01.01’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కంటతడి
కన్నీళ్లు పెట్టుకుని ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్
తన తండ్రి క్యాన్సర్ బారిన పడటంతో కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను తలచుకుని ఆమె కంటతడి పెట్టుకున్నారు.
ఆయన అనారోగ్యం తనను ఎంతగానో కుంగదీసిందని… pic.twitter.com/OaAN7QeEGm
— ChotaNews App (@ChotaNewsApp) April 28, 2026




