
డెప్యూటీ తహశీల్దార్, ఏఈఆర్ఓ, బీఎల్ఓ ముగ్గురు సభ్యులతో కమిటీలు వేసి ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఆదేశించింది. తొలగించిన ఓట్లను, కొత్తగా చేర్చిన ఓట్లను ఈ కమిటీలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకొంటాయి. కనుక ఇకపై సచివాలయ సిబ్బంది లేదా ఎవరో ఓ అధికారి ఆదేశాలతో ఓట్ల తొలగింపు, చేరికలు ఉండబోవని ఆశిస్తున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ ఓట్ల అవకతవకలకు పాల్పడిన అధికారులపై ఇప్పటికే ఈసీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గతంలో అక్రమాస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డికి తోడ్పడినందుకు పలువురు ఉన్నతాధికారులు జైలుకి వెళ్ళిన్నట్లే, ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసేందుకు తోడ్పడిన అధికారులు జైలుకి వెళ్ళవలసి వస్తుందని, కనుక వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఇటువంటి అవినీతి పనులలో భాగస్వాములు కావద్దని పయ్యావుల కేశవ్ హితవు పలికారు.
ఓటర్లు ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో వారే నిర్ణయించుకోవాలి సచివాలయ సిబ్బంది లేదా వైసీపీ నేతలుకారన్నారు. ఇప్పుడే త్రిసభ్య కమిటీలు ఏర్పాటవుతున్నాయని కనుక ఓటర్ల వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి జాబితాలలో అక్రమాలకు పాల్పడినవారందరూ జైళ్ళకు వెళ్ళేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఇది అంతం కాదని ఆరంభం మాత్రమే అని అన్నారు. వాలంటీర్లు కూడా ఈ ఓటర్ల నమోదు, జాబితాల తయారీ ప్రక్రియకు దూరంగా ఉండాలని లేకుంటే వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని పయ్యావుల కేశవ్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…
Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…