తెలంగాణలో పెద్ది పరిస్థితి ఇంకా అగమ్యగోచరమేనా?

ఇంకో రెండు రోజుల్లో పెద్ది రిలీజ్ కి రెడీ. రామ్ చరణ్ & టీమ్ అన్నీ రాష్ట్రాలు తిరుగుతూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్రాలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అది కూడా ప్రీమియర్ షోస్ కి. కానీ.. తెలంగాణ పరిస్థితి ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు. టికెట్ హైక్ కి ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందని కొందరు, రాలేదని కొందరు, హైక్ తో సంబంధం లేకుండా ప్రీమియర్స్ ఉంటాయని మరికొందరు రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కానీ.. ఇప్పటివరకు మైత్రీ నుండి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.

ఆంధ్రాలో ప్రీమియర్స్ కి 600/- రూపాయల టికెట్ హైక్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ 1000 రూపాయల హైక్ కోసం అత్యాశ పడకుండా, కాస్త జనాల్ని భయపెట్టని హైక్ వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలోనూ అదే స్థాయిలో రేట్లతే వెళితే, మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే.. రేపు (జూన్ 2) తెలంగాణ అవతరణ దినోత్సవం, ఎల్లుండి సాయంత్రం ప్రీమియర్స్. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో టికెట్ హైక్ వస్తుందా? హైక్ రాకుండా ప్రీమియర్ షోస్ వేస్తారా? లేదా? అనే కన్ఫ్యూజన్ జనాల్లో గట్టిగా ఉంది.

ADVERTISEMENT

ఈ గందరగోళం గతంలో “రాజాసాబ్” విషయంలో జరిగి ఉండడం తెలిసిందే. అర్ధరాత్రి 12 గంటలవరకు హైద్రాబాద్ లో ప్రీమియర్స్ విషయంలో క్లారిటీ లేక, ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద నిల్చుని నీరసించి ఇళ్ళకి వెళ్ళిపోయినవాళ్ళు కూడా ఉన్నారు. మైత్రీ విమల్ థియేటర్ దగ్గర అయితే.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి మరీ అభిమానులు బయటకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటలకి, ఇంకొన్ని చోట్ల తెల్లవారు 2 గంటలకి షోలు పడ్డాయి. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పైన చాలా గట్టిగా పడింది. బాహుబలి తర్వాత మొదటిసారి ప్రభాస్ కి సరైన డే 1 నెంబర్ లేకుండాపోయాయి.

ఆ సినిమా హైక్ & రిలీజ్ ఇష్యూ మైత్రీ సంస్థకి పెద్ద గుణపాఠంలా మిగిలింది. ఇప్పుడు “పెద్ది” విషయంలోనూ అలాంటి పరిస్థితి పునరావృతం కానుందనే అనుమానాలు మెగా అభిమానుల్లో కలుగుతున్నాయి. రేపు సాయంత్రానికి గనుక తెలంగాణలో ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదంటే మాత్రం “పెద్ది”కి పెద్ద దెబ్బే. ఈ సినిమాకి కూడా 3వ తారీఖు మధ్యాహ్నం లేదా సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేస్తాం అంటూ ఊరించి.. ఆఖరికి చేయలేకపోతే మాత్రం మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సీనియర్ హీరోలు సీరియస్ గా తీసుకోవడం మానేస్తారు. మరి మైత్రీ రవి & శశి ఈ విషయంలో ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? అవి అభిమానులను ఏమేరకు మెప్పించగలుగుతాయి? అనేది రేపు రాత్రి కల్లా తెలిసిపోతుంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Kaaka Is Official, Vishwambhara Is Still A Mystery

Chiranjeevi’s Sankranthi 2027 plans have taken a clear turn. Kaaka has officially locked January 13,…

18 minutes ago

Old Video, Fresh Fire: Ranbir Gets Trolled Again

An old video of Ranbir Kapoor refusing Ganesh prasad has resurfaced, and it has now…

33 minutes ago