ఇవాళ్టి నుండి అందరికీ అందుబాటులో పెద్ది

Peddi Ticket Rates

సినిమా పనైపోయింది అని అందరూ అనుకున్న తరుణంలో.. తెలుగు వెర్షన్ మాత్రం రెండో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ తో పర్వాలేదనిపించుకునేలా ఉంది “పెద్ది”. నిజానికి ఈ సినిమాకి వచ్చిన టాక్ కి, జరిగిన రచ్చకి సినిమా మొదటివారానికే పడిపోతుంది అనుకున్నారు. ఓవర్సీస్ & తెలుగు మినహా మిగతా భాషల్లో సినిమా కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ నెగిటివిటీ సరిపోదు అన్నట్లు.. టికెట్ హైక్ లు కూడా సినిమాని ప్రేక్షకులకు దూరం పెట్టాయి. సింగిల్ స్క్రీన్ రేట్లు కూడా 150కి పైగా ఉండడంతో చాలామంది ఇంకా సినిమా చూడలేదు. ఇవాళ్టితో ఆ అడ్డుగోడ తొలగనుంది. ఆంధ్రాలో టికెట్ హైక్ కి తీసుకున్న పర్మిషన్ తాలుకు జీవో నిన్నటితో ముగిసింది. దాంతో ఇవాళ (జూన్ 14) నుండి “పెద్ది” సాధారణ రేట్లతో ప్రేక్షకులకు లభ్యం కానుంది. ఎలాగు శుక్రవారం దాకా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కాబట్టి.. ఈ రెండోవారం పెరుగుతున్న కలెక్షన్స్ కి ఈ నార్మల్ రేట్స్ కాస్త హెల్ప్ అవ్వొచ్చు. అందువల్ల ఆంధ్రా-తెలంగాణ వరకు డిస్ట్రిబ్యూటర్లు. ఎగ్జిబిటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ADVERTISEMENT

ఆంధ్రాలో సరే మరి తెలంగాణలో టికెట్ రేట్లు మళ్లీ నార్మల్ కి ఎప్పుడు వస్తాయి? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. ఈ టికెట్ హైక్ లు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎంత మేలు చేస్తున్నాయి అనేది తెలియదు కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం సినిమాలకి దూరం చేస్తున్నాయి. ఏదో ఈవెంట్ ఫిలిమ్స్ కి అయితే పర్లేదు కానీ.. అన్నీ సినిమాలకి హైక్ అనేది మంచిది కాదు. ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలు ఎప్పటికీ గుర్తిస్తారో ఏమో.

ADVERTISEMENT
Latest Stories