Telugu

పెద్దిరెడ్డి కబ్జా కధలు: ఇంకెన్ని ఉన్నాయో?

కొమ్మకు కొమ్మకు సన్నాయి అన్నట్లు వైసీపీ అధినేత జగన్‌ మొదలు కార్పొరేటర్ వరకు ఎవరిని కదిపినా తప్పకుండా ఓ అవినీతి, అక్రమం, భూకబ్జా లేదా దౌర్జన్యం ఫ్లాష్ బ్యాక్ బయటపడుతుందని ఈ కేసుల వరద చూస్తే అనిపిస్తుంది.

మాజీ మంత్రులలో అంబటి రాంబాబు వంటి కొందరు అవసరానికి మించి మాట్లాడుతుంటారు కానీ వారిపై ఇంత వరకు ఏ కేసు బయటపడలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మీడియాతో పెద్దగా మాట్లాడే అలవాటు లేదు. కానీ నిశబ్ధంగా భూకబ్జాలకు పాల్పడి కేసులో చిక్కుకున్నారు.

ADVERTISEMENT

అటవీశాఖ అధికారులు సర్వే చేసి ఆయన చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేటలో అటవీ భూములు కబ్జా చేశారని తేల్చి చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ఆదేశం మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఇది కాక పెద్దిరెడ్డి భూకబ్జా కధలు ఇంకా చాలానే ఉన్నాయి. మదనపల్లిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-42) ని ఆనుకొనున్న బికేపల్లిలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట ఓ అర ఎకరం కొనుగోలు చేసి, దాని పక్కనే ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు! ఆ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

పెద్దిరెడ్డి వంటి అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అటువంటిది రెవెన్యూ అధికారులు ఆయన కబ్జా చేసిన1.35 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం మామూలు విషయం కాదు. కానీ చేసి చూపించారు. మరి అటవీ భూముల కబ్జా కేసులో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారా లేదా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? చూద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth-Kamal Haasan Film Shelved? What Went Wrong?

A few months ago, the highly anticipated promo for Kamal Haasan and Rajinikanth's reunion project…

6 minutes ago

Virat Kohli to Be Sacked? RCB’s Secret Plan Revealed!

Royal Challengers Bengaluru (RCB) reportedly considered replacing Virat Kohli as captain during the 2019 IPL…

35 minutes ago