
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కు ఇప్పటివరకు 1 మిలియన్ క్లబ్ లో ఒక్క సినిమా కూడా లేదంటే ఆశ్చర్యపడే సినీజనాలకు, ఈ చిన్న సినిమా పెద్ద పాఠమే నేర్పింది. స్టార్ ఇమేజ్ కన్నా కధాబలం గొప్పదని ‘పెళ్లిచూపులు’ వంటి చిన్న సినిమాలు ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నాయి. తాజా అప్ డేట్స్ మేరకు, ఈ సినిమా 8.35 లక్షల డాలర్స్ (5.59 కోట్లు) అందుకుని, 1 మిలియన్ వైపుకు పరుగులు పెడుతోంది.
బహుశా ఈ సినిమా బడ్జెట్ కు ఓ మూడు రెట్లు ఎక్కువ ఒక్క ఓవర్సీస్ లో వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తుండడంతో వచ్చే వీకెండ్ నాటికి ఆ క్లబ్ లో చేరడం ఖాయంగా కనపడుతోంది. కధాబలం ఉన్న సినిమాలకు తామిచ్చే ప్రతిఫలం ఈ రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలకు తెలిసే విధంగా “పెళ్లిచూపులు” ఫలితం ఉంది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…