
గతంలో సుచి లీక్స్ పేరుతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడగా, తెలుగు చిత్ర పరిశ్రమలో చిరు లీక్స్ లొల్లి కలవర పెట్టింది. అయితే ఇప్పుడు ఈ లీక్స్ రగడ ఏపీ రాజకీయాలకు పాకింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ రాజకీయ ఫార్ములా ను లీక్ చేసేసారు. దీనితో అటు వైసీపీ పార్టీ తో పాటుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనుసరిస్తున్న పరామర్శల ఫార్ములా మీద చర్చ జరుగుతుంది.
నైట్ కి మూడోకంటికి తెలియకుండా లేపేయాలి, ఆ పొద్దున్నే మరో మనిషికి అనుమానం రాకుండా పరామర్శించాలి….అంతే కానీ ఇలా రప్ప రప్ప నరుకుతాం అంటూ అరుచుకోకూడదు,
అలా అరిచే కుక్కలు ఎప్పటికి మొరగవు, అరిచే కుక్కల మాదిరి కాకుండా కరిచే కుక్కల మాదిరి నడుచుకోవాలి అంటూ పేర్ని నాని వైసీపీ క్యాడర్ కు లీక్ చేసిన వైసీపీ ఫార్ములా ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.
పేర్ని చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ ఇన్నాళ్ల పరామర్శల యాత్రకు మూల సిద్ధాంతం ఇదేనా అంటూ వైసీపీ కి కౌంటర్లు పేలుతున్నాయి. దీనితో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైస్ వివేకా గొడ్డలి వేటు ఉదంతాన్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డోర్ డెలివరీ సంఘటనను, సింగయ్య తొక్కిసలాట మరణాన్ని తెరమీదకు తెచ్చింది.
వైస్ జగన్ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి దారుణంగా గొడ్డలి వేటుకు బలైతే సాక్షి నుంచి వైసీపీ వరకు ఆ దారుణ మారణ హోమాన్ని గుండె పాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చివరికి అది కుదరక పోయే సరికి ‘రాత్రి లేపేసి పొద్దున్న పరామర్శించే’ ఫార్ములతో నారాసుర రక్త చరిత్ర అంటూ అందరిని ఆచ్చర్యపరిచిందా.? అంటూ వైసీపీ మీద మీద ప్రశ్నల దాడి జరుగుతుంది.
అయితే వైస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి కూడా పేర్ని నాని చెప్పినట్టుగానే ఆ సమయంలో ఎక్కడ వైస్ వివేకాకు వ్యతిరేకంగా అరిచిన దాఖలాలు లేవు.
ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇదే ఫార్ములతో తన డ్రైవర్ ను హత్య చేసి ఏమి తెలియని వాడిలా, ఎవరికీ కనిపించకుండా శవాన్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకోవాలని భావించారు. చివరికి దొరికిపోయి దొంగయినా కూడా వైసీపీ రాజకీయంలో భాగంగా దొరలా తిరుగుతున్నాడు.
ఇక తాజాగా వైస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జగన్ కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. అయితే మొదట్లో వైస్ జగన్ నుంచి వైసీపీ క్యాడర్ వరకు ఆ మరణానికి జగన్ కు అసలు సంబంధమే లేదు, అది జగన్ కారు కాదు అంటూ వాదించే ప్రయత్నం చేసారు.
చివరికి వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో జగన్ కారు కింద పడినప్పుడు సింగయ్య చనిపోలేదు, అంబులెన్స్ లోనే ఎదో జరిగింది అంటూ నేరం ప్రభుత్వం మీదకు నెట్టే ప్రయత్నం చేసారు.
ఇక ఎట్టకేలకు వైసీపీ రాజకీయంలో భాగమైన లేపేయ్, పరామర్శించే కార్యక్రమంలో భాగంగా సింగయ్య కుటుంబానికి జగన్ పరామర్శ మోక్షం దక్కింది. దీనితో వైసీపీ రాజకీయంలో బయటకు కనిపించేది ఒకటైతే లోపల జరిగేది మరొకటి అనేది తేటతెల్లమయింది. మరి పేర్ని లీక్స్ తో వైసీపీ అధిష్టానం నానికి శాలువా కప్పి సన్మానం చేస్తుందో లేదో చూడాలి.
అయితే పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ కు ఎంత బలాన్ని ఇస్తాయో తెలియదు కానీ సామాన్యుడికి మాత్రం చాల భయాన్ని పుట్టించాయి. వైసీపీ నేతల చేతిలో అధికారం ఉంటే అది ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో, ఎందరి మరణాలకు కారణంగా మారుతుందో అని చెప్పడానికి పేర్ని నాని వ్యాఖ్యలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…