
ప్రస్తుతం వైసీపీ ఎదుర్కుంటున్న ఈ దుస్థితికి గత ఐదేళ్లు తనవంతు కృషి చేసారు మాజీ మంత్రి పేర్నినాని. జగన్ దగ్గర పెద్దపాలేరును నేను అంటూ సగర్వంగా చెప్పుకున్న ఈ బందరు మాజీ ఎమ్మెల్యే 2024 ఎన్నికల పోటీకి నో చెప్పి తన వారసుడు పేర్ని కిట్టు ని రంగంలోకి దింపారు.
తండ్రి పాపాలు, కొడుకు ఆగడాలు వైసీపీ పాలిట శాపంలా మారి పేర్ని కుటుంబం నుండి మచిలీపట్టణం ప్రాంతానికి విముక్తి కలిగింది. కానీపేర్నినాని చేస్తున్న రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా నలిగిపోతూనే ఉంది.ఎన్నికల ముందు వై నాట్ 175 అన్న జగన్ అండ్ కో ఎన్నికల ఫలితాల తరువాత కనీసం 1 +7 + 5 = 13 మంది కూడా మీడియా ముందుకు రాలేని పరిస్థితి.
కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యాలన్నా, వైసీపీ పార్టీని డిఫెండ్ చెయ్యాలన్నా, వైసీపీ పార్టీ చేసే ఫేక్ కథనాలను ప్రచారం చెయ్యాలన్నా జగన్ కు పేర్నినాని ఒక్కడే దిక్కు అనేలా ఎప్పుడు మీడియా ముందుకు రాజకీయ పోటీకి రాజీ పడ్డ మాజీ మంత్రే దిక్కయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని చెలాయించిన సజ్జల రామకృష్ణ రెడ్డి,పెద్దిరెడ్డి, విజయ సాయి రెడ్డి, వైవీసుబ్బా రెడ్డి వీరంతా వైసీపీ ఓటమితో సైలెంట్ అయ్యారు.
కానీ పేర్ని నాని మాత్రం జగన్ మీద తన స్వామి భక్తి చాటుకునేందుకు ఇంకా పోటీ పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా మీడియా ముందుకు రావడం కూటమి ప్రభుత్వం మీద నోరుపారేసుకోవడం నాని దినచర్యలో భాగమైపోయింది. తాను ఓడిపోతానని ముందుగానే అంచనాకు వచ్చిన నాని తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేపించారు. అయినా ప్రజలు ఛీ కొట్టారు.
ఇంకా పేర్ని నాని తన వైఖరి మార్చుకోకుండా జగన్ కోసం ఇంకెంత స్థాయికైనా దిగజారుతాను అన్నట్లుగా వ్యవహరించి తన వారసుడి భవిష్యత్ కి రాజకీయ సమాధి కడుతున్నారు. వైసీపీ గెలిచినా, ఓడిన పేర్నినాని “తిట్టు తిట్టించుకో” పథకం మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…