Telugu

సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని నాలుగు రోజుల క్రితం ‘చీకట్లో కనుసైగ చేస్తే వేసేయాలి.. తెల్లారక ఏమీ ఎరగనట్లు వెళ్ళి పరామర్శించాలి’ అంటూ తమ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఆ వీడియో లీక్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇది సరిపోదన్నట్లు ఆయన ఫోన్ సంభాషణ మరొకటి లీక్ అయ్యింది. దానిలో ‘మంత్రి నారా లోకేష్‌ ఆదేశం మేరకే గుడివాడ ఎమ్మెల్యే అనుచరులు గుడివాడ జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హారికపై దాడి చేశారని ప్రచారం చేయాలని, ఈ దాడిని బీసీ మహిళపై దాడిగా హైలైట్ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మనవాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయాలి. వాళ్ళందరికీ జగన్‌ చేత గట్టిగా చెప్పిస్తేనే వింటారు. ఆయన ఆదేశం మేరకు కులం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేద్దాము,” అని పేర్ని నాని తన అనచరులకు చెపుతుండగా ఎవరో రహస్యంగా అది రికార్డ్ చేసి మీడియాకు లీక్ చేశారు.

ADVERTISEMENT

ఈ రెండూ మీడియాలో వచ్చేయడంతో మచిలీపట్నం పోలీసులు తనపై కేసు నమోదు చేయబోతున్నారని గ్రహించిన పేర్ని నాని యూ టర్న్ తీసుకొని తాను ఆవిదంగా అనలేదని, కూటమి ప్రభుత్వమే ఆ విదంగా తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయించి తనని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు.

“నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. “టీడీపీ నేతలు మనల్ని రప్పా రప్పా నరుకుతాం.. అండర్ వేర్ మీద రోడ్లపై నడిపిస్తాం.. అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా మనవాళ్ళు సంయమనం కోల్పోవద్దని చెప్పాను. సైకో ఆలోచనలు చేయకుండా మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏవిదంగా సేవ చేశామో ఇప్పుడూ అలాగే చేయాలి తప్ప టీడీపీ వాళ్ళలా మనమూ రెచ్చిపోకూడదని మా వాళ్ళకు చెప్పాను.

మనం ప్రజల నమ్మకం సంపాదించేందుకు ఏమేమి చేస్తామో చెప్పుకొని వారికి కు దగ్గరయ్యేందుకు అందరూ కృషి చేయాలని చెప్పాను. దానినే టీడీపీ తన అనుకూల మీడియాలో పదేపదే డ్రైవ్ చేయిస్తూ నాపై అక్రమ కేసు బనాయించాలని ప్రయత్నిస్తోంది. కానీ నేను ఇలాంటి కేసులకు భయపడేవాడిని కాను. ధైర్యంగా ఎదుర్కొంటాను,” అని పేర్ని నాని అన్నారు.

పేర్ని నాని ఎల్లో మీడియా అంటూ బుకాయించి తప్పించుకోవాలనుకున్నా ఆయన మాట్లాడిన మాటలు వీడియోతో సహా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా? వైసీపీ ఫ్యాక్షనిజం చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఈవిదంగా సీనియర్ నేతలే ఫ్యాక్షనిజం ప్రోత్సాహిస్తారనే విషయం పేర్ని నాని వీడియో లీక్‌తో బయటపడింది. తద్వారా వైసీపీ ఏవిదంగా ఎటువంటి రాజకీయాలు చేస్తుందో స్పష్టమవుతోంది కదా?

తన ఆడియో, వీడియో లీక్ అయిపోవడంతో తీవ్ర ఆందోళన చెందినట్లు కనిపిస్తున్న పేర్ని నాని నోట ‘సైకో’ అని మరోసారి నోరు జారారు. టీడీపీ, జనసేనలు జగన్మోహన్ రెడ్డిని ‘సైకో’ అంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీలో సీనియర్ నేత పేర్ని నాని ‘సైకో పాలన’ అనడంపై ఇప్పుడు జగన్‌ ఏవిదంగా స్పందిస్తారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

5 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

6 hours ago