పిక్ టాక్ : రియల్ లైఫ్ సూపర్ స్టార్!

Amy Jackson didn't miss fangirl selfie though rajnikanth is entirely hers!60 సంవత్సరాలు పైబడి ఇప్పటికీ ‘ఇండియన్ సూపర్ స్టార్’ హోదాను అనుభవిస్తున్న కధానాయకుడు రజనీకాంత్. ప్రస్తుతం ‘రోబో 2.0’ షూటింగ్ లో పాల్గొంటున్న రజనీ, ఆ సినిమా కధానాయిక అమీ జాక్సన్ తో కలిసి ఒక సెల్ఫీ ఫోటోలో దర్శనమిచ్చారు. రెండు పదుల వయసు దాటిన ఈ ముద్దుగుమ్మ ‘రోబో 2.0’లో రజనీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఎటువంటి హంగామా లేకుండా తన రియల్ లైఫ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలా ఉంటారో ఈ ఫోటోలో చూడవచ్చు. నిజానికి సినీ సన్నివేశాలకు తప్ప ఇతర సమయాలలో రజనీ ముఖానికి మేకప్ వేయరన్న విషయం తెలిసిందే. అందుకు నిదర్శనమే ఈ తాజా ఫోటో. రజనీ హుందాతనం గురించి నేడు ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన పనిలేదు. అభిమానులంతా ‘దటీజ్ సూపర్ స్టార్’ అని గర్వంగా చెప్పుకునే విధంగానే రజనీ నడవడిక ఉంటుంది మరి!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories