
ఏ ఆటలోనైనా గెలుపోటములు సర్వ సాధారణం. ముఖ్యంగా రాజకీయ క్రీడలో ఓడలు బండ్లవ్వడం బండ్లు ఓడలవ్వడం తరుచుగా జరిగే ప్రక్రియలో భాగమే. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అనే సత్యాన్ని మరిచి ప్రవ్తరిస్తే దాని తాలూకా పతనం ఏ స్థాయిలో ఉంటుందో భవిష్యత్ తరానికి తెలియచేసారు వైసీపీ నాయకులు.
ఒక్క గెలుపు తాలూకా విధ్వంసం, ఒక్క ఓటమి తాలూకా పతనం మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకు రాగలదో ఒక రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వంటి వైసీపీ నాయకులను చూస్తే అర్ధమవుతుంది. గెలుపుతో బలుపెక్కిన ఈ నాయకులందరూ ఒక్క ఓటమితో పాతాళానికి పడిపోయారు.
అధికారంలో ఉన్నంత కాలం మీడియా ముందుకొచ్చి ప్రతిపక్ష నేతలను నోటికి వచ్చిన బూతులు తిడుతూ వాడు వీడు అంటూ హేళన చేస్తూ ఐదేళ్ల విలువైన సమయాన్ని వృధా చేసారు. బాబు జైలుకు వెళితే టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్న రోజా ఇప్పుడు నగరిలో ఘోర ఓటమి చవిచూసింది. రోజా ఓడిపోయినందుకు సొంత పార్టీ కార్యకర్తలే స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
వాడేం పీకుతాడు, వీడేం పీకుతాడో చూస్తా అంటూ ఒక ప్రజాప్రతినిధి గా ఉంటూ వీధి రౌడీ మాదిరి ప్రవర్తించిన కొడాలి నానిని నువ్వు రాజకీయాలకు అనర్హుడివి అంటూ ప్రజలే ఎమ్మెల్యే గా పీకి పక్కన కూర్చోపెట్టారు. దీనితో ఇప్పుడు నాని జుట్టు పీక్కోవడం తప్ప మరేం చేయలేని పరిస్థితిలో నిలబడ్డారు. తానూ ఎమ్మెల్యే గా ఉండగా మాచర్లలో టీడీపీ నేతలు అడుపెడితే దాని తాలూకా విధ్వంసం ఎలా ఉంటుందో నడిరోడ్డు మీద చేసి చూపించారు పిన్నెల్లి.
అయితే తాము బటన్ నొక్కితే పిన్నెల్లి పరిస్థితి ఏమవుతుందో మొన్న జరిగిన ఎన్నికలలో తెలిసొచ్చేలా చేసారు మాచర్ల ప్రజలు. ఒక్క ఓటమితో గత ఐదేళ్ల అరాచకానికి తెర పడింది. తెలుగు దేశం నాయకుల్ని ఈ భూమి మీదే లేకుండా చేద్దాం అనుకున్న పిన్నేల్లికి మాచర్లలలో కాదు జైల్లో స్థానం కల్పించారు. సమాజమే సిగ్గుపడే వ్యాఖ్యలతో బాబు సతీమణి భువనేశ్వరి పై నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ ఇప్పుడు ధైర్యంగా రోడ్డు మీద తిరగలేని పరిస్థితి.
ఇక ఆర్కే, కరకట్ట కమలహాసన్ సంగతికి వస్తే.., 2014 రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఎదో రకంగా అడ్డుతగులుతూనే ఉన్నారు. రాజధాని అమరావతిని అడ్డుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి అప్పటి ముఖ్యమంత్రి బాబు పై అనేక కేసులు వేశారు. అలాగే రాజధాని పరిధిలోకి వచ్చే తన సొంత నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటూ కులాల మధ్య చిచ్చులు పెట్టి తానూ గెలిచింది జగన్ కోసమే ప్రజల కోసం కాదనేలా పని చేసారు.
చివరికి 2024 ఎన్నికలలో ఆ జగనే ఈయన గారికి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో అన్న మీద అలిగి చెల్లి దగ్గరకు చేరారు. అక్కడ కూడా నిలకడ లేక మళ్ళీ జగన్ చెంతకే చేరి మంగళగిరిలో మరోసారి లోకేష్ ను ఓడించి తీరుతా అంటూ శపధం చేసారు. ఎన్నికల ముందు వరకు మంగళగిరి నియోజకవర్గానికి తానే రాజు తానే మంత్రి అనుకున్న ఆర్కే ఎన్నికల ఫలితాల తరువాత కనీసం సామాన్య పౌరుడు మాదిరి కూడా కనిపించడం లేదు.
అలాగే గుడివాడ లో నన్ను కొట్టే మగాడే లేదు అంటూ కొడాలి, జగన్ మెప్పుకోసం ఏ స్థాయికైనా దిగజారగాలను అంటూ రెచ్చిపోయిన వంశీ, నగరి గడ్డ రోజా అడ్డా అంటూ రెచ్చిపోయిన రోజా అధికారంతో వచ్చిన మదం పోయి ఓటమితో వచ్చిన భయం తెలిసొచ్చిందని అందుకునే మీడియా కంటికి కూడా కనిపించకుండా దాక్కుంటున్నారు అంటున్నారు టీడీపీ శ్రేణులు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…