
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి మీద కాకుండా ప్రతిపక్షాల విధ్వంసం మీదే ప్రభుత్వం ద్రుష్టి సారించి అందుకు అనుగుణంగానే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రాన్ని ఒక్కో అడుగు వెనక్కి నెట్టింది.
వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంతో ముడి పెట్టి మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్ళాలు అంటూ పవన్ ను హేళన చేస్తూ ఎన్నో అవమానాలకు గురి చేసింది వైసీపీ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని ఆ పార్టీ కార్యకర్త వరకు ఇదే తరహా విమర్శలతో ఐదేళ్ల విలువైన సమయాన్ని మహిళలను కించపరచడం మీదే కేంద్రికరించారు.
తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, అడ్డుకుంటే అరెస్టులు, ఎదురిస్తే జైళ్లు అన్నట్టుగా అవినీతి సామ్రాజ్యంతో ఏకచక్రాధిపత్యం చేసిన జగన్ ప్రభుత్వాన్ని నేలకూల్చక పొతే నా పేరు పవన్ కల్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు అంటూ శపధం చేసారు పవన్ కళ్యాణ్. ఆ శపధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని వ్యూహాలైన వేస్తా అంటూ టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం సాధించారు పవన్.
టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల బంధంతో వైసీపీ మూడు రంగుల జెండాను కిందకు దించి 151 సీట్లతో ఉన్న వైసీపీ ఫ్యాన్ ను 11 సీట్లకు పరిమితం చేసి తానూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పవన్. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను అవమానించాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలతో సంబంధం లేని ఆయన సతీమణి నారా భువనేశ్వరిని అవహేళన చేస్తూ సమాజం సిగ్గుతో తలదించుకునే వ్యాఖ్యలు చేసారు వైసీపీ నేతలు.
వైసీపీ నేతల దురాగతాలను ఖండించాల్సిన జగన్ షిక్కటి చిరునవ్వులు చిందిస్తూ పైచాశిక ఆనందాన్ని అనుభవించారు. 40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేని అవమానాన్ని తన ద్వారా తన భార్య కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆవేదనతో చంద్రబాబు కన్నీటితో అసెంబ్లీకి వీడ్కోలు పలికి తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను అంటూ శపధం చేసారు.
2024 ఎన్నికలలో టీడీపీ కూటమికి 164 సీట్ల అఖండ మెజారిటీతో తీర్పు వెలువరించారు ఏపీ ఓటర్లు. దీనితో నాల్గవ సారి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తన భార్యకు అవమానము జరిగిన చోట తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అంటూ బాబు చేసిన శపధం జూన్ 9 తో నెరవేరబోతోంది. ఇలా బాబు, పవన్ లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ శపధాలు నెరవేర్చుకున్నారు.
అయితే ఎట్టి పరిస్థితులలోను కూటమి పార్టీ అధికారంలోకి రాదు, జూన్ 9 న తిరిగి రెండవసారి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అంటూ కొందరు వైసీపీ నేతలు తొడలు కొట్టారు. ఈ ఉగాది తరువాత టీడీపీ, జనసేన పార్టీలు ఉంటే నేను గుండు కొట్టించుకుంటా అంటూ మాజీ మంత్రి బొత్స, పవన్ ను ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అంటూ ముద్రగడ, తునిలో 15 వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ దాడి శెట్టి తొడలు కొట్టి మీసాలు మెలేసి శపధాలు చేసారు.
అయితే మెజారిటీ సంగతి పక్కన పెడితే అసలు ఈ శపధాలు చేసిన నేతలెవ్వరూ కనీసం గెలుపు అంచున కూడా నిలవలేదు. దీనితో మీరు మీ శపధాలు నిలబెట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారు అంటూ వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. మాట తప్పడం, మడం తిప్పడం వైసీపీ డీఎన్ఏ లో భాగం అంటూ జగన్ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ఏసుకుంటున్నారు.
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…
ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…