
అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ, “చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతికి, ఆంధ్రా ప్రగతికి అవరోధంగా నిలుస్తున్న ఆ దుష్ట గ్రహాలు అడ్డు తప్పుకున్నాయి. వాటి పీడ వదిలింది కనుక ఇక అమరావతి పనులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జోరుగా సాగిపోతుంది,” అని అన్నారు.
సాధారణంగా ప్రధాని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్ధ పార్టీలని, వాటి అధినేతలని నేరుగా సంభోదించరు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తమ రాజకీయ ప్రత్యర్ధి పార్టీలు, నేతల గురించి మరికాస్త ఎక్కువ మాట్లాడవచ్చు కానీ ఇటువంటి అధికారిక కార్యక్రమాలలో మాత్రం ఈవిదంగా క్లుప్తంగానే చెపుతుంటారు.
ప్రధాని మోడీ చెప్పిన ఆ దుష్ట గ్రహాలు ఎవరో అందరికీ తెలుసు. ఒకవేళ ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తే ఆ దుష్ట గ్రహాలు తామే అని స్వయంగా చాటింపు వేసుకున్నట్లవుతుంది. కనుక ఆ దుష్ట గ్రహాలు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉండిపోయి, ప్రధాని మోడీ అన్న మాటలకు లోలోన తిట్టుకోకుండా ఉండరు.
అమరావతిని అడ్డుకున్న దుష్ట గ్రహాలు పొరుగు రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అవి కూడా ఈ కారణంగానే కిక్కురుమనలేదు.
అయినా ఆ దుష్ట గ్రహాలు చెప్పు దెబ్బ తగిలినట్లు కుయ్యోమని ఏడుస్తుంటే, ఏడుస్తున్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం అవసరమా?
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…