
ఇందిరా గాంధీ పాక్ నుంచి బాంగ్లాదేశ్ విడదీసి ఇచ్చినందున, పాక్ పాలకులు, సైన్యాధికారులు భారత్ నుంచి కశ్మీర్‌ని విడదీసి పాక్‌లో కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు.
అయితే తమ అధీనంలో ఉన్న కశ్మీర్‌ని అభివృద్ధి చేయకపోగా దానిని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూపీయే హయంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం చాలా బలంగా ఉండేవి. వాటిని నిర్మూలించి జమ్ము కశ్మీర్‌ని అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోవడం వలన ఆ రాష్ట్రంలో ఎప్పుడూ రాళ్ళ దాడులు, కాల్పులు, బాంబుల మోత వినిపిస్తుండేవి.
ఆ కారణంగా జమ్ము కశ్మీర్‌లో కూడా ఎప్పుడూ అశాంతి, అరాచకం నెలకొని ఉండేవి. కనుక అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కారు.
కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెలమెల్లగా జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడమే కాకుండా ఆ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణగా కశ్మీర్‌ని భారత్‌లో మిగిలిన రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ రూ.46,000 కోట్లు వ్యయంతో నిర్మించిన చినాబ్ రైల్వే వంతేనే. ప్రపంచంలొకే ఎత్తైన ఈ రైలు వంతెనని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. వందే భారత్ రైలులో ఆ వంతెన మీదుగా ప్రయాణించారు కూడా.
ఇది కాక జమ్ము కశ్మీర్‌లో రూ.2,700 కోట్లు వ్యయంతో సోనామార్గ సొరంగ మార్గం నిర్మించారు. జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో ఆ రాష్ట్రంలో క్రమంగా వేర్పాటువాదం తగ్గి యువత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి వైపు మళ్ళుతున్నారు.
జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు భారత్‌లో విలీనం అయిపోవాలని కోరుకుంటున్నారు.
పైగా పాక్ ఉగ్రవాదంతో వేసారిపోయున్న అక్కడి ప్రజలు, పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ పాకిస్థాన్‌ని ఏవిదంగా దెబ్బ కొట్టారో చూసిన తర్వాత, అత్యంత శక్తివంతమైన భారత్‌లో కలిసి ఉంటేనే తమ జీవితాలలో మళ్ళీ వెలుగులు వస్తాయని చెపుతున్నారు.
ప్రధాని మోడీ కూడా ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌లో విలీనం చేయడమే తన తదుపరి లక్ష్యమని పదేపదే చెపుతున్నారు కూడా. కనుక ఆ లక్ష్యం మరెంతో దూరం లేదని భావించవచ్చు.
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…