కేటీఆర్‌ వెకిలి నవ్వులకు ఫుల్ స్టాప్ సీబీఐతోనే?

కేటీఆర్‌ నేడు ఓ సభలో మాట్లాడుతూ, “ఏపీలో పోలవరం కట్టాలని 1940లో అనుకుంటే 1980లో శంకుస్థాపన జరిగింది. కానీ 2004లో పనులు మొదలయ్యాయి. కానీ 2014 జూన్‌ తర్వాత పనులు జోరందుకున్నాయి.

అయినా నేటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తికాలేదు. 2027 డిసెంబర్‌కి పూర్తయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. ఎక్కడ 1940 ఎక్కడ 2027…. దేశంలో 87 ఏళ్ళపాటు నిర్మాణం సాగుతున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ఒక్కటే!

ADVERTISEMENT

అదే… మా కేసీఆర్‌గారు 2016లో కాళేశ్వరంకి శంకుస్థాపన చేసి 2019కల్లా అన్నిటినీ పూర్తిచేసి నీరందించారు. కేసీఆర్‌ పనితనానికి, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాల పనితనానికి తేడా వివరించడం కోసమే పోలవరం గురించి చెప్పాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని అన్నారు.

నిజమే! పోలవరం నిర్మాణానికి చాలా సమయం పట్టింది. కానీ 1940లో పోలవరం మొదలైందంటూ కేటీఆర్‌ మాటకారితనం ప్రదర్శించారు. వాస్తవానికి ఏప్రాజెక్టుకైనా శంకుస్థాపనతోనే లెక్క మొదలవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో శంకుస్థాపన చేసి మొదలుపెట్టామని ఆయనే చెప్పుకున్నారు కదా?

పోలవరం ప్రాజెక్టుపై ఇరుగు పొరుగు రాష్ట్రాలతో అనేక న్యాయవివాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా దీనిపై చాలా పేచీలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

ఇంకా అప్పటి పాలకులు, కాంట్రాక్టర్ల రూపంలో రాజకీయ నాయకులు దీనిని ‘ఏటిఎం’లా వాడుకున్నారే తప్ప పూర్తిచేయాలనుకోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తవకపోవడానికి ఇదీ ఓ ప్రధాన కారణమే.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం పనులు పరుగులు పెట్టించారని కేటీఆర్‌ స్వయంగా ఒప్పుకున్నారు. కానీ ఆయన తండ్రి కేసీఆర్‌ పుణ్యమాని జగన్‌ రావడంతో 5 ఏళ్ళు దీనికి మళ్ళీ బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే 2027కల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని జోరుగా పనులు చేయిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ తనకి రాష్ట్రంలో ఎదురే లేకుండా చేసుకున్నారు. కనుక కాళేశ్వరంపై ఎవరి అభ్యంతరాలు పట్టించుకోకుండా నచ్చినట్లు నిర్మించారు.

ఒకవేళ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరాలు చెప్పి, అడ్డుకొని ఉంటే కేసీఆర్‌ కాళేశ్వరం పూర్తి చేయగలిగేవారా? కానీ జగన్‌ మౌనంగా ఉండిపోయి కేసీఆర్‌కి సహకరించడమే కాకుండా, వెళ్ళి కేసీఆర్‌తో కలిసి కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కూడా.

కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగిపోయింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలు పగుళ్ళు ఏర్పడి పనికిరాకుండా పోయాయి.

ఈ కారణంగా సుమారు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గత రెండేళ్ళుగా నిరుపయోగంగా మారింది. ఆ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ కుటుంబం వేలకోట్ల అవినీతికి పాల్పడిందని పీసీ ఘోష్ కమీషన్‌ నివేదిక ఇవ్వగా దానిపై సీబీఐ దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసింది.

ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా పోలవరం గురించి వెకిలి నవ్వులు నవ్వుతూ నోటికొచ్చిన్నట్లు మాట్లాడారు. కానీ రేపు కాళేశ్వరం కేసుపై విచారణకు సీబీఐ రంగంలో దిగితే, ఈ వెకిలి నవ్వుల స్థానంలో ఆర్తనాదాలు, కాళ్ళ బేరాలు, విలీనాలు మొదలవకుండా ఉంటాయా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Adivi Sesh’s Dacoit Trends on OTT After Theatrical Run

Adivi Sesh has hit another home run as his latest thriller, Dacoit, has claimed the…

13 minutes ago

బెంగాల్ బ్రహ్మచారి.. సువేందు అధికారి ముఖ్యమంత్రి

బిజేపికి బ్రహ్మచర్యం బాగా అచ్చొచ్చినట్లుంది. ప్రధాని మోడీ, యూపీ సిఎం యోగీ ఆదిత్య నాథ్ తర్వాత పశ్చిమ బెంగాల్లో మరో…

48 minutes ago