
తాను ఇక ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నానని, న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. సుధాగర్‌ని, ఇయక్కం ఆర్గనైజేషన్‌కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా చెబుతూ పోలీసులు అరెస్టు చేశారని, దీని వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని, తమపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుందని అన్నారు. ఇప్పుడు మా ‘ఇయక్కం’ సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలని సూచించారు.
అరెస్టులకు గురయినప్పటికీ తన అభిమానులు ఎక్కడా హద్దులు దాటకుండా ఉండాలని, అలాగే తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పనిలేదని, ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే తమ పని అని, ప్రతిఫలం లేని ఈ బాధ్యతను ఎప్పటికీ కొనసాగిస్తామని, పాలకులు వస్తారు… పోతారు… కానీ దేశం శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.
We have now arrived at a point where the Telugu audience are simply not stepping…
Tamil Nadu politics has taken a dramatic turn after a major split surfaced inside All…